చింతామణి నాటకంపై నిషేధం.. రఘురామ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్‌లో విచారణ

By Siva KodatiFirst Published Dec 2, 2022, 5:17 PM IST
Highlights

చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. 
 

దశాబ్ధాలుగా తెలుగు ప్రజలను వారు వాడా ఉర్రూతలూగించిన చింతామణి నాటక ప్రదర్శనపై ఇటీవల ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆర్యవైశ్య సామాజిక వర్గం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ప్రభత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. రఘురామ తరపున లాయర్ ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. 

చింతామణి నాటకం సమాజానికి సందేశాన్ని అందిస్తుందని.. దీనిపై నిషేధం సరికాదన్నారు. దీని వల్ల నాటక రంగంపై ఆధారపడిన వందలాది మంది కళాకారుల ఉపాధి దెబ్బతింటుందని ఉమేశ్ చంద్ర కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక కులం మనోభావాలు దెబ్బతిన్నాయని నాటకాన్ని నిషేధిస్తే.. మిగిలిన కులాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం వుందన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

ALso REad:వైసిపి రెబల్ ఎంపీ రఘురామకు హైకోర్టులో చుక్కెదురు... చింతామణి నాటకంపై నిషేధం కొనసాగింపు

కాగా.. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి  పాత్ర ప్ర‌ధానమైనది. ఆయ‌న ఓ వైశ్యుడు. స్త్రీ వ్యామోహంలో పడి డబ్బు ఎలా పోగొట్టుకున్నాడు.  అయితే ఈ పాత్ర ద్వారా తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆర్య వైశ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ చింతామణి నాటక ప్రదర్శనను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకుడదని ఆదేశాలు జారీ చేసింది. 

తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం చింతామణి. 20వ శతాబ్దంలోని మూడో దశకంలో సామాజిక సమస్యల ఆధారంగా కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు.  ఈ నాటకం ఇప్పటికీ ఊరూరా ప్రదర్శితమవుతూనే ఉంటుంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకాన్ని తొలిసారి బందరు రామమోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింపబడింది. అలాంటిది ఈ నాటకాన్ని రాష్ట్రంలో నిషేధించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.

దీంతో పలువురు రంగస్థల నటులు, ఇతరులు చారిత్రాత్మక నాటకంపై నిషేదం తగదని జగన్ సర్కార్ ను కోరారు. అయినప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఇలా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించగా విచారణ కొనసాగుతోంది. 

click me!