
కడప: తేనే కోసం వెళ్లి వాగులో కొట్టుకుపోయిన ముగ్గురిలో ఇద్దరు మృతి చెందగా, ఒక్కరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఉమ్మడి కడప జిల్లాలో చోటు చేసుకుంది.
Nellore జిల్లా Udayagiri మండలం Durgampalli కి చెందిన తొమ్మిది మంది honey ను తెచ్చేందుకు Forestప్రాంతానికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో వారు Kadapa జిల్లాలోని Gopavaramమండలం Vallalavaripalemకి చేరుకున్నారు. ఆదివారం నాడు అటవీ ప్రాంతంలో తేనేను సేకరించిన తొమ్మిది మంది రాత్రి కావడంతో అక్కడే నిద్రపోయారు. వీరు పడుకున్న చోట వాగు ఉంది. అయితే ఆదివారం నాడు అర్ధరాత్రి వాగు పై భాగంలో Heavy Rain కురిసింది.
ఈ వర్షంతో వాగు పొంగిపొర్లింది. అయితే ఈ విషయాన్ని గుర్తించని వారు నిద్రలోనే వాగులో ముగ్గురు కొట్టుకుపోయారు. అయితే ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు వాగులో కొట్టకుపోయి చనిపోయారు. చనిపోయిన వారిని మామిళ్ల రమేష్ మామిళ్ల వెంగయ్యలుగా గుర్తించారు. స్థానికుల సహాయంతో ఇద్దరు డెడ్ బాడీలను పోలీసులు వెలికి తీశారు.