ఏపీ కేబినెట్ భేటీ వాయిదా.. జూన్ 24న సమావేశం కానున్న మంత్రివర్గం

Published : Jun 20, 2022, 03:22 PM IST
ఏపీ కేబినెట్ భేటీ వాయిదా.. జూన్ 24న సమావేశం కానున్న మంత్రివర్గం

సారాంశం

ఎల్లుండి జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. 

ఎల్లుండి జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. తొలుత ఈ నెల 22న కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముహుర్తం ఖరారు చేశారు. అయితే తాజాగా కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. దావోస్ పర్యటనలో కూదుర్చుకున్న ఎంవోయూలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇళ్ల నిర్మాణ పురోగతి, ఇరిగేషన్ ప్రాజెక్టులు.. తదితర అంశాలు కూడా  ఈ బేటీలో చర్చకు రానున్నట్టుగా తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్