తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం: తమిళనాడుకు చెందిన ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

By narsimha lode  |  First Published Jul 10, 2022, 9:23 AM IST

తిరుపతి జిల్లాలోని పి. మల్లవరం సమీపంలో  ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృుతలను తమిళనాడు రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు.


తిరుపతి: Tirupati జిల్లాలోని పి. మల్లవరం సమీపంలో ఆదివారం నాడు ఉదయం జరిగిన Road Accident లో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయడ్డారు.  Tamilnadu కు చెందిన Devotees  కారులో తిరుపతిలో శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్లున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకొంది. కారు అదుపుతప్పి Mallavaram  సమీపంలోని డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. తమిళనాడుకు చెందిన శరణ్య,మిథున్ లు  మరణించినట్టుగా పోలీసులు చెప్పారు. గాయడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు అతి వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడమే కారణంగా పోలీసులు చెబుతున్నారు. అతి వేగంతో వాహనాలు నడిపిన కారణంగా వాహనాలు ప్రమాదానికి గురౌతున్న విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. 

Latest Videos

undefined

also read:యాదాద్రి : ఐచర్ వాహనం బోల్తా, వెనుక నుంచి ఢీకొట్టిన మూడు కార్లు .. ముగ్గురి మృతి

ఆయా రోడ్లలో అతి వేగంతో వాహనాలు నడపడంతో పాటు వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం, రోడ్లపై పార్కింగ్ చేయడం వంటి ఘటనలు కూడా ప్రమాదానికి కారణాలు చెబుతున్నారు. మరో వైపు డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోవడం వంటి ఘటనలు కూడా ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణంగా మారుతున్నారు.

ఈ నెల 4వ తేదీన హైద్రాబాద్ పెద్దగోల్కోండ సమీపంలో కారు ఆగి ఉన్న లారీని ఢికొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వీరంతా మహారాష్ట్రకు చెందినవారు. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకొని మహారాష్ట్రకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఆగి ఉన్న ట్రక్కు వెనుక భాగంలోనికి కారు ముందు భాగం వెళ్లింది. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

ఈ ఏడాది జూన్ 29న హైద్రాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో  మరో ఇద్దరు మరణించారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారే. ఈ ఘటనలో గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది జూన్ 12న సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు.ఈ ప్రమాదానికి మద్యం మత్తులో  లారీ డ్రైవర్ కారు నడపడమే కారణంగా పోలీసులు తేల్చారు. కరీంనగర్ నుండి హైద్రాబాద్ వైపు కారులో  పాపారావు ఆయన భార్య పద్మ వస్తున్నారు. పాపారావు డ్రైవర్ ఆంజనేయులు కారును నడపుతున్నాడు. అయితే కారు చిన్నకోడూరు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ డివైడర్ ను దాటి  పాపారావు ప్రయాణీస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాపారావు ఆయన భార్ పద్మ, కారు డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

 

click me!