కర్నూల్‌లో దారుణం: ఇద్దరు టీడీపీ నేతల హత్య

Published : Jun 17, 2021, 09:13 AM ISTUpdated : Jun 17, 2021, 09:22 AM IST
కర్నూల్‌లో దారుణం:  ఇద్దరు టీడీపీ నేతల హత్య

సారాంశం

 : కర్నూల్ జిల్లాలో పాతకక్షలతో ఇద్దరిని ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది

కర్నూల్: కర్నూల్ జిల్లాలో పాతకక్షలతో ఇద్దరిని ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. మృతులు టీడీపీకి చెందినవారు.పెసరవాయి గ్రామానికి చెందిన  ఒడ్డు నాగేశ్వర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ప్రతాప్ రెడ్డిని ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.  నాగేశ్వర్ రెడ్డి పెసరవాయి గ్రామానికి గతంలో సర్పంచ్ గా పనిచేశాడు.  ప్రతాప్ రెడ్డి సింగిల్ విండో చైర్మెన్ గా కొనసాగుతున్నారు. 

 

మృతుల  చిన్నాన్న ఇటీవలనే మరణించాడు. సోదరుడి మూడో రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ప్రత్యర్ధులు కాపుకాసి వేటకొడవళ్లతో నరికి చంపారు.  వీరిద్దరిని ప్రత్యర్ధులు బొలెరో వాహనంలో ఢీకొట్టారు. ప్రత్యర్ధులు దాడి చేస్తున్నారని గమనించి బాధితులు పారిపోతుండగా నిందితులు వాిని వేటాడి వేటకొడవళ్లతో హత్య చేశారు. సంఘటన స్థలంలో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్రంగా గాయలైనట్టుగా స్థానికులు చెబుతున్నారు.  గాయపడిన వారిని  నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?