నూజివీడులో ఘోర ప్రమాదం.. లారీ ఢీకొనడంతో తల్లీ బిడ్డల దుర్మరణం

By Mahesh KFirst Published Dec 19, 2021, 3:51 PM IST
Highlights

కృష్ణా జిల్లాలోని నూజివీడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు కూతుర్లతో స్కూటీపై ఆ తల్లి బయల్దేరింది. వారిని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ, ఓ కూతురు స్పాట్‌లోనే మరణించారు. కాగా, మరో కూతురు ప్రాణాలతో బయటపడింది. కానీ, తన కళ్ల ముందే తల్లి, సహోదరి రక్తపు మడుగులో కొట్టుకుని విగత జీవులుగా మారిన వైనాన్ని చూసి ప్రాణాలతో ఉన్న చిన్నారి తల్లడిల్లింది.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో  ఘోర ప్రమాదం జరిగింది. నూజివీడు (Nuzvidu)లో రోడ్డు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. ఇందులో తల్లీ బిడ్డ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాగా, ప్రమాదం నుంచి బయట పడ్డ మరో కూతురు.. తన కళ్ల ముందే మరణించిన తల్లీ, సహోదరినీ చూసి తల్లడిల్లిపోయింది. ఈ ఘటన రోడ్డుపై వెళ్లుతున్న పాదాచారులను కంటతడి పెట్టించింది.

నూజివీడు పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. తల్లీ, ఇద్దరు బిడ్డలు స్కూటర్‌పై వెళ్తున్నారు. ఈ ముగ్గురు స్కూటీపై వెళ్తుండగా ఓ లారీ వేగంగా దూసుకువచ్చింది. వీరి స్కూటీని లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒక చిన్నారి ప్రాణాల నుంచి బయటపడగా, మరో చిన్నారి, ఆ తల్లి అక్కడికక్కడే మరణించారు. స్కూటీ కింద ఆ చిన్నారి చిక్కుకుని రక్తపు మడుగులో ప్రాణాలు వదిలింది. ఆమె తల్లి స్కూటీ నుంచి కొంత దూరంలో ఎగిరి పడి ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఈ ఘటనను కళ్లార చూసిన మరో చిన్నారి ప్రాణాలతో బయట పడినా.. తీవ్ర అలజడితో ఉన్నది. కళ్ల ముందే విగత జీవులైన తల్లి, సహోదరిని చూసి తల్లడిల్లిపోయింది. స్థానికులు ఈ ఘటనతో చలించిపోయారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి రోదన స్థానికులను దు:ఖంలో ముంచింది.

Also Read: Blast in Hyderabad: హైద‌రాబాద్ లో భారీ పేలుడు.. ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

20మంది ప్రయాణికులతో కూడిన బొలెరో వాహనం రోడ్డుప్రమాదానికి (road accident) గురయ్యింది. ఈ నెల 29వ తేదీన తెల్లవారుజామున పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన విశాఖపట్నం (visakhapatnam) జిల్లాలో చోటుచేసుకుంది.

విశాఖపట్నం జిల్లాలోని జి మాడుగుల మండలం కొడపల్లి గ్రామంలో తెల్లవారుజామున బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.  పొగమంచుతో దారి సరిగ్గా కనిపించక వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతావారంతా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. 

ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, ప్రకాశం జిల్లాలో (prakasam district) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్ధులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. 15 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మందికి పైగా విద్యార్ధులు వున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా కంభాలపాడు బెల్లంకొండ పాలిటెక్నిక్ కాలేజీలో (bellamkonda polytechnic college) హార్టికల్చర్ విద్యార్ధులుగా సమాచారం. 

Also Read: Hanamkonda quarry accident: హనుమకొండలో క్వారీలో టిప్పర్‌ లారీ బోల్తా.. ముగ్గురు మృతి

పొదిలి మండం కంభాలపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లో ఇండియన్ ఆర్మీ (indian army) వాహనం బీభత్సం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కార్లను ఢీకొడుతూ ముందుకెళ్లిన ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి కారణమయ్యింది. ఈ నెల 18వ తేదీన సాయంత్రం సమయంలో హైదరాబాద్ శివారులో ఈ యాక్సిడెంట్ జరిగింది.

click me!