నిన్న యువకుడు, నేడు యువతి.. విశాఖ రుషికొండ బీచ్‌లో మృతదేహాల కలకలం

Siva Kodati |  
Published : Aug 12, 2022, 02:22 PM IST
నిన్న యువకుడు, నేడు యువతి.. విశాఖ రుషికొండ బీచ్‌లో మృతదేహాల కలకలం

సారాంశం

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో రెండు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. నిన్న ఓ యువకుడి మృతదేహం కొట్టుకురాగా.. శుక్రవారం యువతి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. 

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో రెండు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. రుషికొండ సముద్రతీరానికి గురువారం ఒక యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది.. అతనిని నంద్యాలకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు. ఇదిలావుండగా శుక్రవారం తెల్లవారుజామున ఇదే బీచ్‌కు యువతి మృతదేహం కొట్టుకొచ్చింది. ఆమెను విజయనగరం జిల్లాకు చెందిన దివ్యగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి ఆత్మహత్యగా భావిస్తున్నారు. వీరికి సంబంధించి వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఏమైనా నమోదయ్యాయా లేదా అన్న కోణంలో విచారిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vizag Beach: గోవా దేనికి గురూ? వైజాగ్ తీరంలో ఈ టాప్ 5 బీచ్ రిసార్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?