శ్రీకాకుళంలో విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి

Published : May 05, 2022, 11:01 AM ISTUpdated : May 05, 2022, 11:03 AM IST
 శ్రీకాకుళంలో విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలోని ఆలుమూరు మండలం యలమంచిలిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.


శ్రీకాకుళం: Srikakulam జిల్లాలోని Jalumuru  మండలం యలమంచిలిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.  జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలిలో చింతు Chhinnamma , ఆమె చిన్న కుమార్తె జాహ్నావి, పెద్ద కుమార్తె రంజని, కొడుకు వెంకటసాయి శశాంకర్ లు పెట్రోల్ పోసుకొని ఆత్మహాత్యాయత్నానికి ప్రయత్నించారు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు నలుగురిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చింత చిన్నమ్మ, ఆమె చిన్న కూతురు జాహ్నావిలు మరణించారు. ఘటన స్థలాన్ని నరసన్నపేట సీఐ ఎం. తిరుపతి, జలుమూరు ఎస్ఐ పారినాయుడు పరిశీలించారు.చిన్నమ్మను భర్త నరసింహులును పోలీసులు విచారిస్తున్నారు.ఈ ఘటనకు గల కారణాలపై police ఆరా తీస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu