దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక విషయంలో ఉత్కంఠ నెలకొంది. దుగ్గిరాల ఎంపీపీ పదవికి పోటీ చేసే పద్మావతి అదృశ్యమైంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారని కొడుకు యోగేంద్రనాథ్ ఆరోపిస్తున్నారు.
గుంటూరు: గుంటూరు జిల్లాలోని Duggirala ఎంపీపీ ఎన్నిక విషయమై Tadiboina Padmavath కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. MPP ఎన్నికకు ఒక్క రోజు ముందు పద్మావతి కన్పించకుండా పోవడం కలకలం రేపుతుంది. మంగళగిరి ఎమ్మెల్యే Alla Ramakrishna Reddy అనుచరులు తన తల్లిని కిడ్నాప్ చేశారని పద్మావతి కొడుకు Yogendranath ఆరోపించారు. ఇవాళ దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికను నిర్వహించనున్నారు. అయితే ఎన్నికకు పద్మావతి హాజరు కాకుండా ఉండేలా చేసేందుకే పద్మావతిని కిడ్నాప్ చేయించారని యోగేంద్రనాథ్ ఆరోపిస్తున్నారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో ఇండిపెండెంట్ గా పద్మావతి పోటీ చేస్తే ఆమెకు టీడీపీ, జనసేనలు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నాయి. దీంతో పద్మావతిని ఎన్నికకు దూరంగా ఉంచాలనే వ్యూహాంలో భాగంగానే కిడ్నాప్ చేయించారని యోగేంద్రనాథ్ ఆరోపిస్తున్నారు.
గతంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో దుగ్గిరాల మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాల్లో TDP 9, YCP 8 స్థానాలు దక్కించుకొంది. ఒక్క స్థానంలో Janasena విజయం సాధించింది. అయితే టీడీపీకి జనసేన మద్దతును ప్రకటించింది.దుగ్గిరాల ఎంపీపీ పదవిని బీసీ మహిళక రిజర్వ్ చేశారు.
దుగ్గిరాల మండలంలోని చిలువూరు నుండి గెలుపొందిన Shaik Jabinను ఎంపీపీ అభ్యర్ధిగా టీడీపీ ప్రకటించింది. జబీన్ కు కుల ధృవీకరణ పత్రం కోసం రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారు.ఈ విషయమై కోర్టును కూడా టీడీపీ నేతలు ఆశ్రయించారు. ఎంపీపీ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది.
అయితే జబీన్ కు Caste ధృవీకరణ పత్రం జారీ విషయంలో కలెక్టర్ వద్ద అప్పీల్ కు వెళ్లింది జబీన్ ఫ్యామిలీ. అయితే జబీన్ సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత ఆమెకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వడం సాధ్యం కాదని కలెక్టర్ తేల్చి చెప్పారు. దీంతో టీడీపీకి అభ్యర్ధి కరువయ్యారు.మరో వైపు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికకు వీలుగా కోర్టు స్టే వేకేట్ చేసింది. దీంతో ఎంపీపీ ఎన్నికకు నోటీఫికేషన్ జారీ చేసింది ఎన్నికల సంఘం.
దుగ్గిరాల ఎంపీపీ పదవిని సంతోషరూపవాణికి ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది.
దీంతో వైసీపీ నుండి విజయం సాధించిన పద్మావతి కూడా ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. తాడిబోయిన పద్మావతి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే తాము మద్దతిస్తామని టీడీపీ, జనసేన కూటమి ప్రకటించింది. ఇవాళ ఎంపీపీ ఎన్నిక జరగనుంది. అయితే నిన్ననే తాడిబోయిన పద్మావతితో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. ఆ తర్వాత పద్మావతిని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మనుషులు కిడ్నాప్ చేశారని యేగేంద్రనాథ్ ఆరోపించారు.
ఇవాళ దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికకు పద్మావతి హాజరు కాకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఆమెను కిడ్నాప్ చేశారని టీడీపీ, జనసేన కూటమి కూడా ఆరోపిస్తుంది. పద్మావతి ఎంపీపీ ఎన్నికకు హాజరు కాకపోతే ఎన్నికను వాయిదా వేయాలని ఆమె కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
ఇవాళ ఉదయం వైసీపీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు, కో ఆఫ్షన్ పదవికి పోటీ చేసే అభ్యర్ధితో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దుగ్గిరాల ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. టీడీపీ, జనసేన ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొన్నారు.