ఆటోలో ఒంటరిగా బాలిక... గ్యాస్ లేదనే సాకుతో నిర్మానుష్య ప్రాంతానికి, రైతులే రాకుంటే

Siva Kodati |  
Published : Oct 20, 2022, 05:34 PM IST
ఆటోలో ఒంటరిగా బాలిక... గ్యాస్ లేదనే సాకుతో నిర్మానుష్య ప్రాంతానికి, రైతులే రాకుంటే

సారాంశం

కృష్ణాజిల్లాలో మైనర్ బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్‌లు అత్యాచార ప్రయత్నం చేశారు. అయితే బాలిక కేకలు వేయటంతో పొలంలో పని చేస్తున్న రైతులు వెంటనే అప్రమత్తమై ఆటోను వెంబడించారు.

కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్‌లు అత్యాచార ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే... గురువారం కేసరపల్లి గ్రామం వద్ద ఆటో ఆపి మైనర్ బాలిక ఎక్కింది. అయితే ఆ సమయంలో ఆటోలో ఈమె తప్ప మరో ప్రయాణికుడు ఎవరూ లేరు. ఈ పరిస్ధితిని అదనుగా చేసుకుని బాలికపై కన్నేసిన ఆటోడ్రైవర్... ఆటోలో గ్యాస్ లేదని మరో మార్గం గుండా మైనర్‌ను తీసుకు వెళ్లాడు. అయితే ఉంగుటూరు వైపు ఆటో వెళుతుండగా బాలిక కేకలు వేయటంతో ఆమె గొంతు నులిమాడు. 

Also Read:వివాహిత కిడ్నాప్, అత్యాచారం.. హత్య, ఆరుగురి అరెస్ట్...

బాలిక కేకలు విన్న పొలంలో పని చేస్తున్న రైతులు వెంటనే అప్రమత్తమై ఆటోను వెంబడించారు. అదే సమయంలో ఆటోలో నుండి బాలిక కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. మరోవైపు.. ఆటోను అడ్డుకోనే సమయంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?