అదను చూసి దెబ్బ: బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Oct 20, 2022, 5:00 PM IST

బీజీపీ ఏపీ  మాజీ  చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ఏపీ చీఫ్  సోము వీర్రాజుపై విమర్శలు చేయడం పార్టీలో చర్చకు దారితీసింది. సోము వీర్రాజు వర్గానికి కన్నా వర్గానికి కొంతకాలంగా పొసగడం లేదనే  ప్రచారం  పార్టీలో సాగుతుంది.


గుంటూరు:బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కు ,మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వర్గానికి  కొంత కాలంగా పొసగడం  లేదనే  ప్రచారం సాగుతుంది.  ఈ క్రమంలోనే  సోమువీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ రెండు రోజుల క్రితం వ్యాఖ్యలు చేశారనే  అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

చాలా  కాలంగా ఉన్న  అసంతృప్తిని సమయం చూసి కన్నా లక్ష్మీనారాయణ  బయటపెట్టారనే చర్చ కూడా సాగుతుంది.  కన్నా  లక్ష్మీనారాయణ  చేసిన వ్యాఖ్యలు పవన్  కళ్యాణ్ వ్యాఖ్యలకు బలం  చేకూర్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Latest Videos

undefined

ఇవాళ ఉదయం బీజేపీ నాయకత్వం  కన్నాలక్ష్మీనారాయణకు ఫోన్  చేసింది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై  చర్చించింది. పార్టీ అంతర్గత విషయాలపై మీడియాతో మాట్లాడొద్దని కోరింది. పార్టీలో చోటు  చేసుకున్న పరిణామాలను కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధినాయకత్వానికి  వివరించారని సమాచారం. 

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ  చీఫ్ గా  బాధ్యతలు చేపట్టిన తర్వాత సోము వీర్రాజు వర్గం దూరంగా ఉంది.సోము వీర్రాజు  బాధ్యతలు చేపట్టిన సమయంలో కన్నా లక్ష్మీనారాయణ వర్గం దూరంగా ఉంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు  చేసుకున్న రాజకీయ పరిస్థితులు , పార్టీ పరిస్థితులపై అధిష్టానానికి సరైన నివేదికను వీర్రాజు ఇవ్వడం లేదని  కన్నా వర్గం ఆరోపిస్తుంది. 

అమరావతి  అంశంపై అమిత్  షా నుండి స్పష్టత ఇచ్చినా తర్వాత కూడ  సరిగా వ్యవహరించని కారణంగానే బీజేపీకి ఈ విషయమై ఆశించిన మైలేజీ రాలేదని పార్టీలో ఓ వర్గం వాదిస్తుంది.  అధికార వైసీపీపై పోరాటం విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం  సరిగా  వ్యవహరించడం లేదని కన్నావర్గం వాదిస్తుంది.  ఈ పరిణామాలను గమనించిన జనసేన నాయకత్వం బీజేపీ తీరుపై  అసంతృప్తితో ఉన్నారని కన్నావర్గం  వాదిస్తుందని ప్రముఖ తెలుగు న్యూస్  చానెల్  ఎన్టీవీ  కథనం  ప్రసారం చేసింది.

వచ్చే ఎన్నికల్లో  రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి  రాకుండా తాను ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ఇందుకు గాను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానన్నారు. తన  ముందున్న ఆఫ్షన్లను  కూడ  పవన్  కళ్యాణ్  గతంలోనే ప్రకటించారు.  బీజేపీ నుండి రోడ్ మ్యాప్  కోసం  ఎదురు  చూస్తున్నానని చెప్పారు.  పవన్ కళ్యాణ్ బీజేపీ పై చేసిన వ్యాఖ్యలకు  పరోక్షంగా బీజేపీ  రాష్ట్ర నాయకత్వం తీరే  కారణమని   కన్నా లక్ష్మీనారాయణ  వర్గం ఆరోపిస్తుందని ఈ కథనం వివరించింది.  ఈ విషయాలన్నింటిపై  పార్టీ  అధిష్టానానికి  వివరించాలని కన్నా లక్ష్మీనారాయణ  వర్గం  భావిస్తుందని ఈ  కథనం తెలిపింది.

also read:అన్నీ చెప్పాను,పార్టీమార్పుపై ఇలా: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ

పార్టీ అధినాయకత్వం సూచన  మేరకు తాను అంతర్గత విషయాలపై మీడియాతో  మాట్లాడబోనని కన్నా లక్ష్మీనారాయణ  ఇవాళ  మీడియా ప్రతినిధులతో  చిట్  చాట్ లో చెప్పారు.కన్నా వర్గం  చెబుతున్న అంశాలపై పార్టీ  నాయకత్వం ఏ రకంగా స్పందిస్తోందో అనేది భవిష్యత్తు నిర్ణయించనుంది.
 

click me!