దివ్య హత్య కేసు: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన భర్త, బాబాయి

Siva Kodati |  
Published : Jun 13, 2020, 05:21 PM IST
దివ్య హత్య కేసు: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన భర్త, బాబాయి

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన దివ్య హత్య కేసులో శనివారం మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివ్య బాబాయి కృష్ణ, దివ్య భర్త వీరబాబును రిమాండ్‌కు తరలించారు. ఆమెను అనైతిక వ్యాపారానికి పంపించిన కోణంలో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన దివ్య హత్య కేసులో శనివారం మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివ్య బాబాయి కృష్ణ, దివ్య భర్త వీరబాబును రిమాండ్‌కు తరలించారు.

ఆమెను అనైతిక వ్యాపారానికి పంపించిన కోణంలో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. బాబాయి కృష్ణ ఖాతాలో దివ్య రెండు దఫాలుగా లక్ష రూపాయలను వేసింది. 2018 డిసెంబర్‌లో వీరబాబుతో దివ్యకు వివాహం జరగ్గా... కుటుంబపోషణ నిమిత్తం ఆమెను భర్తే అనైతిక వ్యాపారంలోకి దించారని పోలీసులు నిర్థారించారు.

Also Read:విశాఖ దివ్య హత్య కేసు..భర్తే ఆమెను అమ్మేసి...

వీరబాబు, కృష్ణలను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కాగా దివ్య పిన్ని కాంతవేణితో కృష్ణ గొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు.

ఈ క్రమంలో తన మేనల్లుడు వీరబాబుతో దివ్యకు వివాహం చేయించాడు. దివ్య హత్య కేసులో పోలీసులు భర్త కృష్ణ, పిన్ని కాంతవేణి, కృష్ణల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దివ్య హత్య జరిగిన తర్వాత వారు పరారీలో ఉన్నారు.

దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మ 2015లో హత్యకు గురయ్యారు. అయితే తూర్పు గోదావరి జిల్లా పోలీసుల రికార్డుల్లో మాత్రం వారు అదృశ్యమైనట్లు నమోదై ఉంది. ఇప్పటి వరకు వారి జాడ తెలియలేదు.

Also Read:విశాఖ దివ్య కేసు: ఆరుగురు అరెస్ట్, మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టనున్న పోలీసులు

దీంతో వారు ముగ్గురు కూడా హత్యకు గురైనట్లు అనుమానించారు. నిందితులు కూడా అదే విషయం చెబుతున్నట్లు విశాఖపట్నం పోలీసు కమిషనర్ ఆర్ కె మీనా ఇటీవల చెప్పారు. 

దివ్య అందాన్ని ఎరగా వేసి హంతక ముఠా పెద్ద యెత్తున డబ్బులు సంపాదించింది. డబ్బు విషయంలో ఎదురు తిరగడంతో దివ్యను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. 2014లో తనవారిని కోల్పోయిన దివ్య అత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన చిన్నమ్మ క్రాంతివేణి సంరక్షణలో దివ్య పెరిగింది. 

PREV
click me!

Recommended Stories

Yarlagadda Venkata Rao Slams Jagan Mohan Reddy | AP Development | TDP VS YCP | Asianet News Telugu
సరుకు, సామాన్లు పదాలు బూతులుగా ఎందుకు మారాయి? | Telugu Explainer | Asianet News Telugu