కర్నూలులో జంట హత్యలు... ప్రియురాలిని హత్య చేసి, ప్రియుడు ఆత్మహత్య..

Published : Dec 16, 2023, 02:02 PM IST
కర్నూలులో జంట హత్యలు... ప్రియురాలిని హత్య చేసి, ప్రియుడు ఆత్మహత్య..

సారాంశం

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంట లాడ్జ్ లో మృతదేహాలుగా తేలారు. 

కర్నూలు :  ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ లాడ్జిలో జంట హత్యలు కలకలం రేపాయి. మృతులు నందికొట్కూరుకు చెందిన విజయ్, రుక్సానాగా గుర్తించారు. హోటల్లో ప్రియురాలిని హత్య చేసి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. రుక్సానాకు వివాహం అయ్యి, ఓ కొడుకు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. హత్యలకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియదని అన్నారు. మృతురాలి కొడుకుకు తాము లాడ్జ్ లో ఉన్నామని రమ్మంటూ ఫోన్ వచ్చింది. దీంతో అక్కడికి అతను వచ్చేసరికి ఈ విషయం తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?