మూడు రాజధానుల వివాదం.. టెంటు పీకేసిన పోలీసులు, రైతుల అర్థనగ్న నిరసన

By tirumala AN  |  First Published Dec 23, 2019, 10:23 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం రోజు రోజుకు తీవ్ర వివాదంగా మారుతోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల ప్రతిపాదనని ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం రోజు రోజుకు తీవ్ర వివాదంగా మారుతోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల ప్రతిపాదనని ప్రకటించారు. అప్పటి నుంచి అమరావతి ప్రాంత రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. 

గత ఆరు రోజులుగా అమరావతిలో రైతుల, విపక్షాల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సోమవారం నాడు తుళ్లూరులో రైతుల నిరసన కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తుళ్లూరులో నిరసన చేపట్టేందుకు రైతులు టెంటు వేశారు. 

Latest Videos

అక్కడికి పోలీసులు చేరుకొని టెంటుని తొలగించే ప్రయత్నం చేశారు. దీనితో రైతులు, పోలిసుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రైతులు మరోమారు టెంటు వేసి ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతుల నిరసన కొనసాగుతోంది. 

నిడమర్రు, మందడం ప్రాంతాల్లో రైతులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. మందడంలో రైతులు చొక్కాలు తీసేసి రోడ్డుపై అర్థనగ్న ప్రదర్శన, అరగుండులతో ఆందోళన చెప్పట్టారు.రాజధానిని అమరావతి నుంచి తొలగించవద్దు అంటూ నినాదాలు చేశారు. 

ఫేక్ లెటర్స్ తో నాకు సంబంధం లేదు.. 3 రాజధానులపై చిరంజీవి క్లారిటీ!

రైతుల నిరసన కార్యక్రమాలకు విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం వెంటనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. 

అమరావతిలో ఉద్రిక్తత: వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు

అమరావతిని కేవలం శాసన నిర్వహణ రాజధానిగా మాత్రమే ఉంచుతూ.. వైజాగ్ ని కార్యనిర్వహణరాజధానిగా, కర్నూలుని జ్యుడిషియల్ రాజధానిగా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మూడు రాజధానులపై సాధ్యాసాధ్యాలని పరిశీలించేందుకు జి ఎన్ రావు కమిటీ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే. 

click me!