దేశవ్యాప్తంగా వేలాది ఎకరాలు: శ్రీవారి ఆస్తుల చిట్టా ఇదే..!!

By Siva KodatiFirst Published Nov 28, 2020, 4:23 PM IST
Highlights

టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామి వారికి భక్తులు సమర్పించిన ఆస్తులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేశారు

టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామి వారికి భక్తులు సమర్పించిన ఆస్తులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా 1,128 ఆస్తులు, 8,088 ఎకరాల విస్తీర్ణంలో ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వున్న ఆస్తులను ఏ విధంగటా వినియోగంలోకి తీసుకురావాలని పరిశీలన కోసం కమిటీని నియమించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

వైకుంఠ ఏకాదశ సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి వుంచాలని నిర్ణయించినట్లు వైవీ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల పరిశీలన కోసం కమిటీని నియమించామని ఆయన పేర్కొన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతుల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

click me!