పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ స్టాండ్ ఏంటో సీఎం జగన్‌ చెప్పాలి : ఉండవల్లి

By AN TeluguFirst Published Nov 28, 2020, 3:29 PM IST
Highlights

కేంద్రం ఏపీకి పోలవరం ప్రాజెక్టు అప్పగించడంపై స్పష్టత లేదని, పోలవరంపై వైసీపీ వైఖరేంటో సీఎం జగన్ చెప్పాలని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్ చేశారు.పోలవరంపై ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. 

కేంద్రం ఏపీకి పోలవరం ప్రాజెక్టు అప్పగించడంపై స్పష్టత లేదని, పోలవరంపై వైసీపీ వైఖరేంటో సీఎం జగన్ చెప్పాలని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్ చేశారు.పోలవరంపై ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. 

‘పోలవరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించమని చంద్రబాబు నుంచి ఎటువంటి లేఖ ఇవ్వలేదని అన్నారు.  కేంద్రం.. ఏపీకి పోలవరం ప్రాజెక్టు అప్పగించడంపై స్పష్టత లేదన్నారు.

ఏపీ ప్రభుత్వానికి అవమానం కలిగేలా కేంద్రం లేఖ రాసిందన్నారు. పోలవరానికి నిధులు ఇవ్వాలని కేంద్రమే చెప్పింది. 2017 కేబినెట్‌ నోట్‌లో ఏముందో అప్పుడే బయటపెట్టా. 2014 నాటి రేట్లకు 2020లో పనులు చేస్తారా?.. ఇది ధర్మమా? అని ప్రశ్నించారు. 

పోలవరం రిజర్వాయర్, పవర్ ప్రాజెక్టు ఉంటుందా? నీతి ఆయోగ్ ప్రధానికి రాసిన లేఖ ఏంటి? ఏపీకి అన్యాయం జరుగుతుంటే అడగడానికి భయమెందుకు? ప్రజలు అనుకున్నట్లు సీబీఐ కేసులకు భయపడుతున్నారా?’ అని సీఎంను ఉద్దేశించి ఉండవల్లి వ్యాఖ్యానించారు.

click me!