బహ్మోత్సవాల తర్వాత సర్వదర్శనం భక్తులకు టోకెన్లు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి

By Sumanth KanukulaFirst Published Sep 24, 2022, 2:36 PM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. వారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి పలు అంశాలపై చర్చించింది. శ్రీవారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. రూ. 95 కోట్లతో యాత్రికులకు నూతన వసతి సుముదాయాల నిర్మాణం చేపట్టాలని టీడీపీ పాలకమండలి నిర్ణయించింది. తిరుపతిలో వకుళామాత ఆలయం అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకుంది. 

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వడమాలపేట దగ్గర రూ. 25 కోట్లతో 130 ఎకరాల కొనుగోలుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. రూ. 7.90 కోట్లతో తిరుమలలోని కాటేజీల్లో గీజర్లు, ఫర్నిచర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ. 30 కోట్లతో చెర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఆమోదముద్ర వేసింది. రూ. 2.45 కోట్లతో నదకం అతిథి గృహంలో ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

రూ. 3 కోట్లతో నెల్లూరులో కళ్యాణ మండపాల దగ్గర ఆలయం నిర్మాణం చేపట్టాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. క్లాస్ 4 ఉద్యోగుల యూనిఫాం కోసం రూ. 2.5 కోట్లు కేటాయించింది. రూ. 6.37 కోట్లతో ఎస్పీ ఆర్డ్స్ కాలేజ్‌లో అభివృద్ది పనులకు ఆమోద ముద్ర వేసింది. బ్రహోత్సవాల తర్వాత సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల భక్తులకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో తిరుపతిలో కూడా వసతి గదుల కేటాయింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఇక,  టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

click me!