పాయకరావుపేట వైసీపీలో మరోసారి రచ్చకెక్కిన విభేదాలు.. ఎమ్మెల్యే బాబూరావుకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ..

By Sumanth KanukulaFirst Published Sep 24, 2022, 12:47 PM IST
Highlights

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైసీపీ నేతల మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎస్ రాయవరం మండలం గుడివాడలో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సొంత పార్టీ‌ నేతల నుంచే నిరసన సెగ తగిలింది.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైసీపీ నేతల మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎస్ రాయవరం మండలం గుడివాడలో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సొంత పార్టీ‌ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. ఆయనను  సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు వాహనం ముందు బైఠాయించారు. దీంతో వైసీపీలోని ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు వైసీపీ కార్యకర్తలన చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే బాబూరావును అతికష్టం మీద అక్కడి నుంచి తరలించారు. 

పోలీసులు రక్షణ మధయ లక్ష్మీపతి రాజుపేట అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే బాబూరావు ప్రారంభించారు. ఇక్కడ వైసీపీ మండల స్థాయి నాయకుడు బొలిశెట్టి గోవింద్‌తో ఎమ్మెల్యే బాబూరావుకు విభేదాలు ఉన్నాయి. 

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే బాబూరావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికార పార్టీకి చెందిన ఎస్ రాయవరం మండలం ఎంపీపీ శారదాకుమారి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే ఇద్దరు సర్పంచులపై ఎమ్మెల్యే వేటు వేయడంపై తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. తన 22 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంతగా బాధపడలేదన్నారు. వైసీపీలో సీఎం, మంత్రులు, స్థానిక కార్యకర్తలు, ప్రజలు తనను సోదరిగా ఆదరించారని అన్నారు. రాజీనామా చేస్తున్నందుకు తనను క్షమించాలని కోరారు. 

ఇక, కొంతకాలంగా పాయకరావుపేట వైసీపీలో ఎమ్మెల్యే బాబూరావు అనుకూల, వ్యతిరేక వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి బాబూరావు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న నేతలు గతంలో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. ఎమ్మెల్యే బాబూరావు వ్యవహార శైలి రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. 

click me!