కరోనా ప్రభావంతో టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) భక్తులకు సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. ఆన్ లైన్ టికెట్ల జారీని కూడ టీటీడీ తగ్గించింది.
తిరుపతి : కరోనా ప్రభావంతో టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) భక్తులకు సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. ఆన్ లైన్ టికెట్ల జారీని కూడ టీటీడీ తగ్గించింది.
గత ఏడాదిలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో మార్చి నుండి మే మాసం వరకు టీటీడీ భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపివేవారు. అయితే స్వామికి ఏకాంతసేవలను కొనసాగించారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో టీటీడీకి వచ్చే భక్తుల సంఖ్య కూడ తగ్గిపోయింది.
undefined
మరో వైపు అలిపిరి వద్ద ప్రతి రోజూ సుమారు 20 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేసేవారు. అయితే కరోనాను పురస్కరించుకొని ఈ సర్వ దర్శనాల టికెట్ల జారీని నిలిపివేశారు. పరిస్థితిని బట్టి వెంకటేశ్వరస్వామి దర్శించుకొనే భక్తుల సంఖ్యను కూడ ఇంకా తగ్గించాలని కూడ టీటీడీ భావిస్తోంది.
కరోనాకు ముందు వెంకన్న దర్శనం కోసం భారీగానే భక్తులను అనుమతించేవారు. అయితే కరోనా తర్వాత రోజుకు 45 వేల కంటే ఎక్కువగా భక్తులను అనుమతించడం లేదు. ఏపీ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఏపీ సర్కార్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకొంది.