తిరుమల భద్రతా వైఫల్యంపై టీటీడీ సీరియస్.. మహిళా భక్తురాలు పనేనా..?

Published : May 08, 2023, 02:12 PM IST
తిరుమల భద్రతా వైఫల్యంపై టీటీడీ సీరియస్.. మహిళా భక్తురాలు పనేనా..?

సారాంశం

కలిగయుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి చిత్రీకరించిన  దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కలిగయుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి చిత్రీకరించిన  దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో ఇంతా జరుగుతున్న టీటీడీ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇక, తిరుమలలో భద్రతా లోపంపై టీటీడీ సీరియస్‌గా స్పందించింది. సీసీటీవీ పరిశీలన చేపట్టింది. ఆదివారం రాత్రి ఈ వీడియో రికార్డయినట్లు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం గుర్తించింది.  ఓ మహిళ భక్తురాలు ఈ వీడియో తీసినట్టుగా టీటీడీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. 

అయితే మొబైల్ ఫోన్‌తో మహిళా వీడియో తీయలేదని.. సీక్రెట్ కెమెరాతో చిత్రీకరణ చేసిందని టీటీడీ అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టుగా సమాచారం. అయితే ఆ మహిళా భక్తురాలు ఎవరూ, ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే తిరుమలలోని ఇతర సీసీటీవీల ఫుటేజ్‌ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఆమె యాదృచ్చికంగా ఈ పని చేశారా? లేదా ఉద్దేశపూర్వకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో చేశారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. 

ఇక, తిరుమల ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను పరిశీలిస్తే.. వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయం సమీపంలో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే తిరుమలలో భారీ భద్రత ఉంటుందనే సంగతి తెలిసిందే. తిరుమల కొండపై పలు  ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. సీసీటీవీ కెమెరాలతో నిత్యం భద్రతను పర్యవేక్షిస్తుంటారు. చీమ చిటుక్కుమన్న తెలిసేలా భద్రతా వ్యవస్థ పనిచేస్తుందని చెబుతారు. అయితే ఇటీవలి కాలంలో తిరుమలలో చోటుచేసుకుంటున్న ఘటనలపై  శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!