కాకినాడలో దారుణం... చెరువులో తేలియాడుతూ కొట్టుకొస్తున్న వేలాది చేపలు

Published : May 08, 2023, 12:57 PM ISTUpdated : May 08, 2023, 12:59 PM IST
కాకినాడలో దారుణం... చెరువులో తేలియాడుతూ కొట్టుకొస్తున్న వేలాది చేపలు

సారాంశం

చెరువులో విష ప్రయోగం జరిగి వేలాదిగా చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకువస్తున్న ఘటన కాకిినాడలో చోటుచేసుకుంది. 

కాకినాడ : గుర్తుతెలియని వ్యక్తులు చెరువులో విషం కలిపి వేలాది చేపలను చంపేసిన ఘటన కాకినాడు జిల్లాలో చోటుచేసుకుంది. విష ప్రభావంతో చనిపోయిన చేపలన్నీ నీటిపై తేలియాడుతూ ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి. ఇలా చేపల మృతితో లక్షలాది రూపాయలు నష్టపోయిన అక్వా రైతు లబోదిబోమంటున్నాడు. 

పెద్దపురం మండలం ఆర్బి పట్నం శివారులోని రాఘవమ్మ చెరువును కొందరు లీజుకు తీసుకుని చేపల పెంపకాన్ని చెపట్టారు. అయితే వీరంటే గిట్టవారో లేక ఆకతాయి చేష్టలతోనో చెరువు నీటిలో విషం కలిపారు. దీంతో మంచి బరువు పెరిగిన చేపలన్నీ చనిపోయాయి. 

చెరువు ఒడ్డుకు కుప్పలు కుప్పలుగా చేపలు కొట్టుకురావడం చూసి లీజుదారులే కాదు ఇతరులూ బాధపడుతున్నారు. చేపల మృతితో లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని లీజుదారులు కన్నీరు పెట్టుకుంటున్నారు.  

Read More  లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. తూర్పు గోదావరిలో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..!

చెరువు లీజుదారులు, గ్రామస్తుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకుని మృతిచెందిన చేపలను పోలీసులు పరిశీలించారు. నీటిలో విషం కలిపి చేపలు చంపిన దుండగులను గుర్తించి తమకు న్యాయం జరిగేలా చూడాలని చెరువు లీజుదారులు కోరుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు