సెటిలర్స్‌తో సాలూరు ప్రాంతం నష్టపోతుంది.. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళతా: డిప్యూటీ సీఎం రాజన్న దొర సంచలనం

Published : May 08, 2023, 01:09 PM IST
సెటిలర్స్‌తో సాలూరు ప్రాంతం నష్టపోతుంది.. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళతా: డిప్యూటీ సీఎం రాజన్న దొర  సంచలనం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు ప్రాంతం సెటిలర్స్ వల్ల నష్టపోతుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు ప్రాంతం సెటిలర్స్ వల్ల నష్టపోతుందని అన్నారు. సాలూరు మండలం  మావుడి, కొట్టుపరువు పంచాయితీల్లో ఆదివారం రాజన్న దొర గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వాహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాలూరులో చౌదరీలు, రెడ్లు.. వ్యవసాయం, వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుంటున్నారని చెప్పారు. గిరిజిన గ్రామాల్లో రోడ్లేసినా గిరిజనులకు ఉపయోగం తక్కువని, ఎక్కువగా  సెటిలర్లే వినియోగించుకున్నారని  కామెంట్ చేశారు. 

సెటిలర్స్ వారి ప్రయోజనాల కోసం భారీ వాహనాలపై రోడ్లు తిప్పుతుండటంతో రోడ్లు గుంతలుగా మారుతున్నాయని అన్నారు. సెటిలర్స్ వల్ల ఏ ప్రయోజనం లేదని అన్నారు. గిరిజనుల వద్ద సంపాదించుకుని.. అభివృద్దికి మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. కొట్టుపరుపు పంచాయితీలో రోడ్డు వేయాలని  చూస్తే ఓ సెటిలర్ ఆపారని  చెప్పారు. 

సెటిలర్స్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన వద్దకు తీసుకెళ్తానని చెప్పారు. సాలూరు ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించమని కోరతానని తెలిపారు. అలా అయితే సెటిలర్స్ నష్టపోతారని అన్నారు. ఇక, రాజన్న దొర చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu