TTD Tickets:భక్తులకు టీటీడీ శుభవార్త.. ఆన్ లైన్ లో టికెట్ల విడుదల..!

By telugu news teamFirst Published Oct 23, 2021, 10:54 AM IST
Highlights

 రెండు నెలలకు సంబంధించి కోటాలో భాగంగా ఈ రూ.300 దర్శన టికెట్లు ఆన్‌లైన్‌ లో విడుదల చేసింది. ఇందులో భాగంగా రోజుకి 12 వేల టికెట్లు విడుదల చేయనుంది దేవస్థానం.

తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజూ వేల మంది భక్తులు పోటెత్తూ ఉంటారు. పండుగలు, ప్రత్యేక దినాలతో సంబంధం లేకుండా.. స్వామి వారి ఆలయం ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక ప్రత్యేక దినాల గురించి అయితే.. చెప్పక్కర్లేదు. అయితే.. కరోనా తర్వాత ఆలయంలో భక్తుల దర్శనాలపై ఆంక్షలుు విధించారు. ఎక్కువ మందికి టికెట్లు పంపిణీ చేయడం లేదు. దీంతో.. చాలా మంది నిరాశకు గురౌతున్నారు. కాగా.. తాజాగా.. భక్తుల కోసం టీటీడీ శుభవార్త తెలియజేసింది.

Also Read: తిరుమల శ్రీవారి సన్నిధిలో జగన్ కు తులాభారం... మొక్కుతీర్చుకున్న సీఎం (ఫోటోలు)

రూ.300 దర్శన టికెట్ల నవంబర్‌, డిసెంబర్‌ కోటాను విడుదల చేసింది టీటీడీ. రెండు నెలలకు సంబంధించి కోటాలో భాగంగా ఈ రూ.300 దర్శన టికెట్లు ఆన్‌లైన్‌ లో విడుదల చేసింది. ఇందులో భాగంగా రోజుకి 12 వేల టికెట్లు విడుదల చేయనుంది దేవస్థానం.

 అలాగే శనివారం ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇందులో భాగంగా రోజుకు 10 వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. సర్వర్ల సమస్య తలెత్తకుండా వర్చువల్ క్యూలో టికెట్ల కేటాయించనుంది. అయితే ప్రతి రోజు ముందుగానే బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే టికెట్లు కన్ఫర్మ్‌ అవుతాయి.

Also Read: తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం జగన్

 అయితే.. ఇలా విడుదల చేసిన మొదటి రోజే.. 45 నిమిషాల్లోనే 3.35 లక్షల టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. దర్శన టికెట్ల కోసం ఏకంగా 7 లక్షల హిట్లు వచ్చాయంటే శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


నిమిషాల వ్యవధిలోనే తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్ పూర్తి కావడం విశేషం. జియో క్లౌడ్ మేనేజ్‌మెంట్ ద్వారా ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేశారు. అయితే.. గతంలో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో భక్తులకు సర్వర్ సమస్యలు తలెత్తేవి. ఈసారి మాత్రం ఎటువంటి సర్వర్ ఇబ్బందులు లేకుండానే సాఫీగా టికెట్ల విక్రయాలు సాగాయి.

click me!