తిరుపతిలో వర్షబీభత్సం: వరదలో చిక్కుకున్న వాహనం, ఓ మహిళ మృతి

By telugu teamFirst Published Oct 23, 2021, 9:37 AM IST
Highlights

తిరుపతిలో శుక్రవారం అర్థరాత్రి విషాద సంఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రయాణికుల వాహనం వరదల్లో చిక్కుకుంది. ఈ సంఘటనలో ఓ మహిళ మరణించింది.

తిరుపతి: తిరుపతిలో శుక్రవారం రాత్రి విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. శ్రీవారు కొలువైన తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగి ఓ మహిళ మరణించింది. శుక్రవారం అర్థరాత్రి Tirupathiలో భారీ వర్షం కురిసింది. దాంతో వరదలు కూడా వచ్చాయి. తిరుపతిలోని వెస్ట్ చర్చి బ్రిడ్జిపై వరద ప్రవాహం ఉధృతి పెరిగింది. వరదలో తుఫాన్ వాహనం చిక్కుకుంది. డ్రైవర్ వరద ప్రవాహాన్ని సరిగా అంచనా వేయకుండా వాహనాన్ని ముందుకు నడిపించాడు. 

అయితే, వాహనం వరదల్లో చిక్కుకుంది. వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు వరదల్లో చిక్కుకున్నారు. ప్రయాణికుల్లో సంధ్య (30) అనే మహిళ ఊపిరాడక మరణించింది. మరో చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఆమె ఉంది చిన్నారి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Also Read: వరదలు, వర్షాలతో అతలాకుతలం: ఉత్తరాఖండ్‌లో అమిత్ షా ఏరియల్ సర్వే.. సహాయక చర్యలపై ఆరా

వరదలో చిక్కుకున్న వాహనం నుంచి ప్రయాణికులు కొంత మంది ఓ చీరను ఆసరా చేసుకుని బయటకు వచ్చారు. అయితే, సంధ్యతో పాటు చిన్నారి కారులోనే చిక్కుకుపోయారు. దాంతో ఊపిరాడక సంధ్య మరణించింది. చిన్నారి మాత్రం ఆందోళకర పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భక్తులు ప్రయాణిస్తున్న వాహనం రాయచూర్ కు చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత వాహనం డ్రైవర్ పారిపోయినట్లు తెలుస్తోంది.  తిరుపతిలో శుక్రవారం రాత్రి దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. 

వరద ప్రవహానికి West Church Brifge  పూర్తిగా నీటిలో మునిగింది, దాన్ని డ్రైవర్ పసిగట్టలేకపోయాడు. తుఫాను వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు భక్తులు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినవారని సమాచారం. మృతురాలు సంధ్యకు ఇటీవలే వివహామైనట్లు సమాచారం. కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన ఏడుగురు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి తుఫాను వాహనంలో కడప మీదుగా తిరుపతి వచ్చారు. ఏడుగురిలోని ఆరుగురు బయటపడ్డారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఎంట్రీ పాయింట్ లో ఉన్నట్లుగానే వెస్ట్ చర్చ్ బ్రిడ్జి చోటు ఉంటుందని భావించి వాహనాన్ని డ్రైవర్ ముందుకు నడిపాడు. ఇది అండర్ బ్రిడ్జి. వర్షం కురిసిన ప్రతిసారి కూడా అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ బారికేడ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 

అండర్ బ్రిడ్జి కింద పూర్తిగా బురదనీరు ఉంది. చికిత్స పొందుతున్న రెండేళ్ల చిన్నారిని కాపాడడానికి రుయా ఆస్పత్రి వైద్యులు కృషి చేస్తున్నారు. మరో 24 గంటలు దాటితే గాని చిన్నారి పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పలేమని అంటున్నారు. 

ఇదిలావుంటే, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. వాతావరణంలో ఏర్పడిన అనిశ్చితి ఏర్పడింది.

Also Read: ఉత్తరాఖండ్‌లో వర్షాలకు 16 మంది మృతి.. నైనితాల్‌కు రాకపోకలు బంద్

click me!