ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

Published : May 24, 2022, 11:57 AM IST
ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

సారాంశం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టికెట్ల తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. 

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టికెట్ల తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.  కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన  సుప్రభాతం, తోమాల, అర్చన.. జూలై నెలకు సంబంధించి అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నది. వీటి కోసం మే 26 మధ్యాహ్నం 3 గంటల వరకూ భక్తుల నమోదుకు అవకాశం ఉంది. అదే సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్‌ డిప్‌ ద్వారా సేవా టికెట్లు పొందిన భక్తులకు టీటీడీ సమాచారం అందివ్వనున్నది. 

భక్తులు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను పొందొచ్చు. ఇక, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వర్చువల్ కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవరం, ఉంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ 25వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మొదలవుతుందని టీటీడీ తెలిపింది. 

ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. ఆదివారం రోజున శ్రీవారిని 75,324 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,085 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే