ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే జీపీఎస్ ను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి
అమరావతి: Andhra Prades రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘంతో ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం నాడు భేటీ కానున్నాయి. CPS రద్దు అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. సీపీఎస్ స్థానంలో GPS ను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే జీపీఎస్ తమకు వద్దని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. అయితే జీపీఎస్ పై అధ్యయనం చేసిన తర్వాత అభిప్రాయాలు చెప్పాలని ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విసయమై మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Chandrababu Naidu ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపక్షనేతగా ఉన్న YS Jagan సీపీఎస్ ను రద్దు చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 25న కేబినెట్ సబ్ కమిటీతో ఏపీలోని ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో సీపీఎస్ రద్దు చేసిన జీపీఎస్ ను తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జీపీఎస్ కు తాము వ్యతిరేకమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. ఈ తరుణంలో ఇవాళ మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. 16 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు.