కరోనా ఎఫెక్ట్: శ్రీవారి భక్తులపై ఆంక్షలు... దర్శనాలను కుదించిన టీటీడీ

By Siva KodatiFirst Published Mar 30, 2021, 7:45 PM IST
Highlights

ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సారి విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. తాజాగా తిరుమల శ్రీవారి భక్తులపై కోవిడ్ ప్రభావం పడింది. వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సారి విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. తాజాగా తిరుమల శ్రీవారి భక్తులపై కోవిడ్ ప్రభావం పడింది.

వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీనిలో భాగంగా రోజూ ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు కుదిస్తున్నట్లు తెలిపింది.

అలాగే  భక్తుల ఆర్జిత సేవల అనుమతిపై టీటీడీ పునరాలోచనలో పడింది. ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని గతంలో  టీటీడీ నిర్ణయించింది.

కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 14 తర్వాత నిర్ణయం తీసుకోనుంది టీటీడీ. అలాగే రేపటి నుంచి అన్ని దర్శనాలను కలిపి రోజుకు 45 వేల మందికి మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. 

కాగా, వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులపై ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. దీనిలో భాగంగా శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారికే తిరుమలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను టీటీడీ అమలు చేసింది. నడకదారి భక్తులకు ముందు రోజు ఉదయం 9 గంటల నుండి అనుమతి ఉంటుందని అధికారులు చెప్పారు.

అలాగే వాహనాల్లో వచ్చేవారికి ముందు రోజు మధ్యాహ్నం 1 గంట నుండి అనుమతి ఇస్తామని ప్రకటించారు. మరో వైపు రాష్ట్రంలో  కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదు కావడంతో  ఈ నిర్ణయం తీసుకొన్నామని అధికారులు తెలిపారు. 

గత ఏడాది కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో తిరుమల స్వామివారికి ఏకాంత సేవలను నిర్వహించారు. గత ఏడాది మార్చి మాసంలోనే తిరుమల ఆలయాన్ని మూసివేశారు. 

click me!