కొత్తగా 993 మందికి పాజిటివ్.. గుంటూరులో అత్యధికం: ఏపీలో విజృంభిస్తోన్న కరోనా

Siva Kodati |  
Published : Mar 30, 2021, 07:15 PM ISTUpdated : Mar 30, 2021, 07:16 PM IST
కొత్తగా 993 మందికి పాజిటివ్.. గుంటూరులో అత్యధికం: ఏపీలో విజృంభిస్తోన్న కరోనా

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలోని మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, పంజాబ్ తరహాలోనే ఏపీలోనూ ప్రతిరోజూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 993 మందికి పాజిటివ్‌గా తేలింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలోని మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, పంజాబ్ తరహాలోనే ఏపీలోనూ ప్రతిరోజూ కేసులు పెరుగుతున్నాయి.

తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 993 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 9,00,805కి చేరుకుంది.

కరోనా కారణంగా గుంటూరు, కృష్ణ, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,213కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో 480 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,86,978కి చేరింది. గత 24 గంటల్లో వ్యవధిలో 30,851 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం టెస్టుల సంఖ్య 1,50,52,215కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజు అనంతపురం 49, చిత్తూరు 179, తూర్పుగోదావరి 29, గుంటూరు 198, కడప 18, కృష్ణా 176, కర్నూలు 37, నెల్లూరు 35, ప్రకాశం 30, శ్రీకాకుళం 45, విశాఖపట్నం 169, విజయనగరం 16, పశ్చిమ గోదావరిలలో 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు