తిరుమల వెంకటేశ్వరస్వామి పెద్ద జియ్యంగార్లు కరోనా నుండి కోలుకొన్నారు. శుక్రవారం నాడు వెంకన్న కైంకర్య సేవలో కూడ ఆయన పాల్గొన్నారు.
తిరుపతి: తిరుమల వెంకటేశ్వరస్వామి పెద్ద జియ్యంగార్లు కరోనా నుండి కోలుకొన్నారు. శుక్రవారం నాడు వెంకన్న కైంకర్య సేవలో కూడ ఆయన పాల్గొన్నారు.
తిరుమలలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులను నివారించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకొంటుంది. గత నెలలో కఠినంగా ఆంక్షలను అమలు చేశారు. దీంతో కరోనా కేసులు నియంత్రణలోకి వచ్చినట్టుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.
undefined
కరోనా బారిన పడిన పెద్ద జియ్యంగార్లు ఇవాళ విధులకు హాజరయ్యారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. అపోలో చికిత్స తర్వాత ఆయన కోలుకొన్నారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన నేరుగా ఇంటికి చేరుకొన్నారు.
శుక్రవారం నాడు శ్రీవారి కైంకర్య సేవలో ఆయన పాల్గొన్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డి చొరవతోనే తాను కరోనా నుండి కోలుకొన్నట్టుగా జియ్యంగార్లు అభిప్రాయపడ్డారు.
also read:తిరుమలలో కరోనా దెబ్బ: ఐదు జంటలకే మ్యారేజీ
ఈ ఏడాది జూలై 18వ తేదీన జియ్యంగార్లు కరోనా బారిన పడ్డారు. వెంటనే ఆయనను తిరుపతిలోని స్విమ్స్ లో చేర్పించారు. అక్కడి నుండి ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.