హనుమంతుని జన్మస్థలం అంజనాద్రే, వెనక్కి తగ్గని టీటీడీ: త్వరలో ఆధారాలతో పుస్తకం

By Siva KodatiFirst Published Jul 31, 2021, 7:49 PM IST
Highlights

తమకు లభ్యమైన ఆధారాలు, శాసనాల ప్రకారమే హనుమంతుడి జన్మస్థలంపై ప్రకటన చేశామని టీటీడీ తెలిపింది. సంస్కృతం, పురాణాలు తెలియనివారికి మాట్లాడే హక్కు లేదని మండిపడింది. అంజనాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని టీటీడీ వెల్లడించింది.. 
 

హనుమంతుడి జన్మస్థలంపై ఇంకా వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే శేషాచలం కొండలే ఆంజనేయుడి జన్మస్థలమని టీటీడీ చెబుతోంది. తాజాగా ఈ అంశంపై రెండు రోజుల పాటు అంతర్జాతీయ వెబినార్‌ నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ వెబినార్‌లో పలువురు పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నట్లు చెప్పారు. ఈ మేరకు వెబినార్‌కు సంబంధించిన వివరాలను ధర్మారెడ్డి శనివారం మీడియాకు వివరించారు.

అంజనాద్రిని హనుమ జన్మస్థానంగా నిర్ధారించేందుకు పండిత పరిషత్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పలు ఆధారాలతో అంజనాద్రిని హనుమ జన్మస్థలంగా గుర్తించినట్లు ధర్మారెడ్డి వివరించారు. అంజనాద్రే హనుమ జన్మస్థలంగా చెప్పే ఆధారాలతో త్వరలో పుస్తకం తీసుకొస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.  తమకు లభ్యమైన ఆధారాలు, శాసనాల ప్రకారమే హనుమంతుడి జన్మస్థలంపై ప్రకటన చేశామని టీటీడీ తెలిపింది. సంస్కృతం, పురాణాలు తెలియనివారికి మాట్లాడే హక్కు లేదని మండిపడింది. అంజనాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని టీటీడీ వెల్లడించింది.. 

ALso Read:

కాగా, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల.. హనుమంతుడి జన్మస్థలమని దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. టీటీడీ పండితులచే ఏర్పాటు చేసిన కమిటీ సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని బలమైన ఆధారాలను సేకరించింది. టీటీడీ వద్ద ఉన్న ఆధారాలతో రూపొందించిన నివేదికను ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తామని ప్రకటించింది. తాజాగా ఆధారాలతో సహా పుస్తకం తీసుకురానున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.
 

click me!