చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో మరణాల తీవ్రత.. ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు

Siva Kodati |  
Published : Jul 31, 2021, 05:29 PM IST
చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో మరణాల తీవ్రత.. ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదవ్వగా.. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు  2,053 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 21,180 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,058 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,63,280కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 23 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,377కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 5, ప్రకాశం 3, కృష్ణ 4, గుంటూరు 2, కర్నూలు 2, విశాఖపట్నం 1, శ్రీకాకుళం 1, నెల్లూరులో ముగ్గురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2,053 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,28,723కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 78,992 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,45,63,043కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 21,180 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 47, చిత్తూరు 284, తూర్పుగోదావరి 364, గుంటూరు 182, కడప 140, కృష్ణ 325, కర్నూలు 11, నెల్లూరు 173, ప్రకాశం 242, శ్రీకాకుళం 45, విశాఖపట్నం 89, విజయనగరం 29, పశ్చిమ గోదావరిలలో 127 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.  
 

 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?