టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ

By Nagaraju penumalaFirst Published Jul 1, 2019, 4:18 PM IST
Highlights

మరోవైపు వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా ఉన్న బసంత్‌కుమార్‌కు టీటీడీ జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని బసంత్ ను ప్రభుత్వం ఆదేశించింది. బసంత్ కుమార్ గతంలో రాజ్ భవన్ లో పనిచేశారు. 

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసరాజును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 

శ్రీనివాసరాజు గత ఎనిమిదేళ్లుగా టీటీడీ జేఈవోగా పని చేస్తున్నారు. 2011లో రెండేళ్ల కాలపరిమితితో  జేఈవోగా బాధ్యతలు పూర్తి చేసుకున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. 

గత ప్రభుత్వాలు నాలుగు సార్లు జేఈవోగా శ్రీనివాసరాజును కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. అయితే సుదీర్ఘ కాలంగా టీటీడీ జేఈవోగా శ్రీనివాసరాజు కొనసాగుతుండటంతో తాజాగా ఆయన్ను బదిలీచేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

click me!