విత్తనాలు ఇవ్వలేని సీఎం నీళ్లు తెస్తారట: జగన్ పై లోకేష్ వెటకారం

Published : Jul 01, 2019, 03:01 PM ISTUpdated : Jul 01, 2019, 05:06 PM IST
విత్తనాలు ఇవ్వలేని సీఎం నీళ్లు తెస్తారట: జగన్ పై లోకేష్ వెటకారం

సారాంశం

రైతులకు విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి నీళ్లు తెస్తా అని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి తో చర్చలకు వెళ్లారట. అనంతపురం, విజయనగరం, నెల్లూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల "విత్తనాలో జగన్ " అంటూ రైతులు రోడ్డెక్కుతున్నారని ఆరోపించారు.   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు మాజీమంత్రి నారా లోకేష్. సాగునీటి సమస్యల పరిష్కారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తో వైయస్ జగన్ చర్చలపై సెటైర్లు వేశారు. 

రైతులకు విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి నీళ్లు తెస్తా అని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి తో చర్చలకు వెళ్లారట.  అనంతపురం, విజయనగరం, నెల్లూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల "విత్తనాలో జగన్ " అంటూ రైతులు రోడ్డెక్కుతున్నారని ఆరోపించారు. 

రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్ లో ఎదురుచూపులు, లాటి ఛార్జ్ లో దెబ్బలు తినాలి అని మరో సారి గుర్తు చేసారంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపనకు స్వస్తి చెప్పి రైతులకు విత్తనాలు అందించే పని మొదలు పెట్టండి అంటూ సూచించారు మాజీమంత్రి నారా లోకేష్ 

PREV
click me!

Recommended Stories

Chandrababu Great Speech About Janasena | Pawan Kalyan | Asianet Telugu
ఏపీలో 3డీ కాంక్రీట్ ఇళ్లు.. అస‌లేంటీ టెక్నాల‌జీ, 10 రోజుల్లో ఇంటిని ఎలా క‌ట్టేస్తారు.?