లాక్‌డౌన్‌లోనూ టీటీడీకీ ఆన్‌లైన్ లో రూ. 90 లక్షల ఆదాయం

By narsimha lodeFirst Published May 19, 2020, 11:07 AM IST
Highlights

లాక్‌డౌన్ సమయంలో తిరుమల వెంకన్నకు ఆన్ లైన్ ద్వారా రూ. 90 లక్షల ఆదాయం లభించింది. భక్తులు రాకున్నా కూడ ఆన్ లైన్ లో ఆదాయం లభించింది.

తిరుపతి: లాక్‌డౌన్ సమయంలో తిరుమల వెంకన్నకు ఆన్ లైన్ ద్వారా రూ. 90 లక్షల ఆదాయం లభించింది. భక్తులు రాకున్నా కూడ ఆన్ లైన్ లో ఆదాయం లభించింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి భక్తులకు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనాన్ని నిలిపివేసింది. దీంతో ప్రతి నెల టీటీడీ  50 రోజులకే సుమారు. రూ. 400 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. లాక్ డౌన్ ను కేంద్రం ఈ నెలాఖరు వరకు పోడిగించింది. దీంతో ఆదాయం మరింత కోల్పోయే అవకాశం ఉంటుంది.

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: తిరుమల వెంకన్న చెంతకు ఆర్టీసీ బస్సు ట్రయల్ రన్

ఆలయానికి భక్తులు రాకున్నా కూడ ఆన్ లైన్ లో భక్తులు మాత్రం స్వామివారికి కానుకలను సమర్పించారు. ఏప్రిల్ మాసంలో ఆన్ లైన్ లో భక్తులు సుమారు రూ.90 లక్షలు ఆదాయం లభిస్తోంది. ఏప్రిల్ మాసంలో హుండీ ఆదాయం కూడ ఇంతే మొత్తంలో ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.

లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ పాలకమండలి ప్లాన్ చేస్తోంది. అయితే గతంలో మాదిరిగా భక్తులకు శ్రీవారి దర్శనం ఉండకపోవచ్చు. గంటకు 500 మంది భక్తులను  మాత్రమే అనుమతించే అవకాశం ఉంటుంది.

click me!