Tirumala: టీటీడీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..ప్రమోషన్లు..ఇళ్ల స్థలాలు..!

Published : Jun 11, 2025, 08:15 AM IST
tirumala

సారాంశం

టీటీడీ ఉద్యోగుల సమస్యలపై ఈవో శ్యామల రావు సమీక్ష నిర్వహించి, త్వరిత పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలోని (TTD) ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఈవో (EO) జె. శ్యామల రావు అధికారులకు స్పష్టంగా తెలిపారు. మంగళవారం టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

భక్తులకు సేవలు అందించే ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిని సమయానుకూలంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు, అలవెన్స్‌లు, పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ఫండ్ కేటాయింపు విషయంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కేవలం ఉద్యోగులతో ముట్టడించకుండా, అవసరమైతే ప్రభుత్వ అనుమతులు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు. జీఎన్బీ, వినాయకనగర్, రామనగర్, కేటీ, ఎస్వీ పూర్ హోం వంటి ప్రాంతాల్లో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్‌లలో లీకేజీలు, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ లోపాలపై కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు.

సీనియర్ అధికారులతో కమిటీ…

ఇకపోతే, టీటీడీ కేటాయించిన గృహ స్థలాలపై అనుమతుల విషయంలో స్పష్టత కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్లు, కాలువలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ఇంజినీరింగ్ విభాగం అధికారులు చర్చించాలన్నారు.

తుదకు, ఉద్యోగుల సమస్యలపై సీనియర్ అధికారులు నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ, ప్రభుత్వ స్థాయిలో ఉన్న అంశాలను తానే చూడగలనని చెప్పి, వాటిని తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?