కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్: టీటీడీ పాలక వర్గం కీలక నిర్ణయాలు

By narsimha lodeFirst Published Nov 14, 2023, 1:09 PM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సమావేశం  ఇవాళ జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను  టీటీడీ బోర్డు తీసుకుంది.

తిరుపతి:తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని  టీటీడీ పాలక మండలి సమావేశం  నిర్ణయం తీసుకుంది.  టీటీడీ పాలకమండలి సమావేశం  మంగళవారంనాటు టీటీడీ చైర్మెన్  భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 

టీటీడీలో  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి  ఉద్దేశించిన మార్గదర్శకాల మేరకు  వారిని రెగ్యులరైజ్ చేస్తామని టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.మంగళవారంనాడు టీటీడీ  పాలక మండలిలో  తీసుకున్న  నిర్ణయాలను టీటీడీ  చైర్మెన్  భూమన కరుణాకర్ రెడ్డి  మీడియాకు వివరించారు.

తిరుమల ఆరోగ్య విభాగంలో  650 ఉద్యోగులను మరో ఏడాది పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. రేణిగుంట రోడ్డు నుండి తిరుచానూరు వరకు  రూ. 3.11 లక్షలతో అభివృద్ది పనులు చేయాలని టీటీడీ డిసైడ్ చేసింది.స్విమ్స్ లో  వద్ద రోగులకు విశ్రాంతి భవనానికి రూ. 3.35 లక్షలను కేటాయించారు.

టీటీడీ ఉద్యోగులకు  ఇంటి స్థలం కేటాయించే  ప్రాంతాల్లో  గ్రావెల్ రోడ్డు నిర్మాణం కోసం  నిధులను కేటాయించారు. అంతేకాదు  రూ. 15 కోట్లతో అదనపు రోడ్డు కూడ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  భూమన కరుణాకర్ రెడ్డి  చెప్పారు. 
తిరుపతి రాం నగర్ క్యాట్రస్ లో అభివృద్ది పనులకు రూ. 6.15 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 

తిరుపతి పద్మావతి  చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి  నూతన టీబీ వార్డు నిర్మాణానికి టీటీడీ పాలకవర్గం ఆమోదం తెలిపింది.  స్విమ్స్ వైద్య సదుపాయాలు  పెంపునకు కార్డియోకు  నూతన భవనం నిర్మించాలని కూడ  నిర్ణయించారు.ఈ నెల  23వ తేదీ నుండి అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి  చెప్పారు.

also read:అలిపిరి మెట్ల మార్గంలో చిరుత కలకలం: అప్రమత్తమైన టీటీడీ, భయాందోళనలో భక్తులు

తెలంగాణలోని కరీంనగర్ లో  వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయం తీసుకుంది.తిరుపతిలో చిరుతల కదలికలు పెరగడంతో  బోన్లు, ట్రాక్ కెమెరాలను కొనుగోలు చేయాలని  టీటీడీ నిర్ణయం తీసుకుందని కరుణాకర్ రెడ్డి వివరించారు.  

click me!