శ్రీవారి సేవలో తరించే ఉద్యోగాలు... భర్తీకి టిటిడి గ్రీన్ సిగ్నల్

By Arun Kumar PFirst Published Sep 17, 2020, 9:35 PM IST
Highlights

కలియుగ ప్రత్యక్షదైవమైన వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టాన్ని మరింత మందికి కల్పించేందుకు టిటిడి నిర్ణయం తీసుకుంది. 

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధానం తిరుమలలో పనిచేసే అవకాశాన్ని మరింత మందికి కల్పించేందుకు టిటిడి(తిరుమల తిరుపతి దేవస్థానం)గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా పోస్టులను సృష్టించి వాటి నియామకానికి సిద్దమవుతోంది బోర్డు. టీటీడీ నిర్ణయం మేరకు కొత్తగా 8 పోస్టుల సృష్టించింది ఏపీ ప్రభుత్వం. 

శ్రీవారి నగల విషయం పలుమార్లు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో టీటీడీ మరిన్ని జాగ్రత్తలు చేపట్టింది. అందుకోసం కొత్తగా చీఫ్ జ్యువెలరీ ఆఫీసర్, జ్యువెలరీ ఆఫీసర్, రెండు ఏఈవో, 4 జ్యువెలరీ ఫ్రైజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. 

read more  టిడిపి హయాంలోని సెక్యూరిటీ అధికారులు...సింహాలను అప్పగించలేదు: దుర్గగుడి ఛైర్మన్

గతంలో శ్రీవారి నగల విషయంలో వివాదం చెలరేగి టిటిడినే కాదు ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టాయి. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అయితే తాను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఉండగా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని కలిశానని.. ఆయన అదృశ్యమైన శ్రీవారి ఆభరణాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారని గతంలో పేర్కొన్నారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం.. స్వామి వారి నగలు ఓ ప్రైవేట్ విమానంలో విదేశాలకు తరలివెళ్లాయన్నారు. నాకు తెలిసిన విషయం టీడీపీ నేతలకు, ప్రతిపక్షనేతలకు కూడా తెలుసునని.. అందువల్లే రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నాకు ఏమాత్రం ఆశ్చర్యంగా అనిపించలేదన్నారు. వెంకటేశ్వరస్వామి మౌనంగా ఉన్నారని ఆ దొంగలు భావిస్తున్నారని.. అందుకే ఆ నగలు దొంగిలించవచ్చునని ఆ దొంగలు అనుకుంటున్నారని పవన్ పేర్కొన్నారు.

అంతకు ముందు మాయమైందని చెబుతున్న పింక్ డైమండ్ ఇతర నగలకు సంబంధించిన అంశంపై స్పందిస్తూ.... నగల అదృశ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఆరోపించారు. స్వామి వారి ఊరేగింపు సందర్భంగా భక్తులు నాణేలు విసరడంతో పింక్ డైమండ్ పగిలిపోయిందని అధికారులు చెబుతున్నారని.. అయితే ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో అది ఎలా పగులుతుందో చూపించాలని పవన్ సవాల్ విసిరారు. 

ఇలా కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే శ్రీవారి నగల విషయంపై చాలా మంది చాలా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే నగల భద్రతపై మరింతగా దృష్టి పెట్టిన టిటిడి కొత్త ఉద్యోగాలను సృష్టించి వాటి భర్తీని ముమ్మర చర్యలు చేపట్టింది. 
 

click me!