శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. వైవీ సుబ్బారెడ్డి సమీక్ష, భక్తులకు కీలక సూచనలు

By Siva KodatiFirst Published Aug 4, 2022, 8:03 PM IST
Highlights

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు.  తిరుమలకు వచ్చే భక్తులు కోవిడ్ రూల్స్ పాటించాలని ఆయన సూచించారు. 

బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనాతో రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27న సాయంత్రం 5.05 గంటలకు ధ్వజారోహణం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తులు కోవిడ్ రూల్స్ పాటించాలని సుబ్బారెడ్డి తెలిపారు. మరోవైపు 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి వున్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,628 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 32,604 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే నిన్న శ్రీవారికి రూ.4.11 కోట్ల హుండీ ద్వారా వచ్చింది. 

కాగా.. జూలై నెలలో శ్రీవారికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. మొదటి సారిగా జూలై నెలలో శ్రీవారికి రూ.139.45 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో మే నెలలో 130.5 కోట్లు వచ్చింది. తద్వారా వరుసగా ఐదో నెలలో ఆదాయం రూ.100 కోట్లు దాటింది. 

ALso Read:తిరుమ‌లలో క‌ల‌క‌లం సృష్టించిన ఏసు క్రీస్తు స్టిక‌ర్ ఉన్న కారు.. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు..

ఇకపోతే.. ఈ నెలలో కేవలం 21 రోజుల్లోనే శ్రీవారి హుండీ ద్వారా రూ.100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. జూలై నెలలో టీటీడీ (ttd) చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు గత మే నెలలో రూ.130 కోట్లే అత్యధిక హుండీ ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో మొదటిసారి శ్రీవారికి రూ.140 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. 

మరోవైపు జూలై 5న భక్తులు శ్రీవారికి రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు. ఇలా ఒక్క రోజులో 6 కోట్ల పైచీలుకు ఆదాయం రావడం తిరుమల చరిత్రలో ఇది రెండోసారి. గతంలో 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకల్ని హుండీలో వేశారు భక్తులు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా తిరుమలకు రాలేని భక్తులు.. ఇప్పుడు పరిస్ధితులు కుదుటపడటంతో పోటెత్తుతున్నారు. ఈ కారణం చేతనే హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోందని అధికారులు అంటున్నారు. ఇకపోతే వేసవి సెలవుల కారణంగా గడిచిన నాలుగు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోన్న సంగతి తెలిసిందే. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఈ ఏడాది శ్రీవారి ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని టీడీడీ అంచనా వేస్తోంది.

click me!