ఆనందయ్య మందు: తయారీ, పంపిణీ నుంచి తప్పుకుంటున్నాం.. వైవీ సుబ్బారెడ్డి సంచలన ప్రకటన

By Siva KodatiFirst Published Jun 1, 2021, 5:22 PM IST
Highlights

ఆనందయ్య మందు తయారీ, మందు పంపిణీపై స్పందించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఆనందయ్య మందు తయారీ, పంపిణీ ఆలోచన విరమించుకున్నామని తెలిపారు. కేంద్ర సంస్థ సీసీఆర్ఏఎస్ నివేదికలో ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టమైందన్నారు

ఆనందయ్య మందు తయారీ, మందు పంపిణీపై స్పందించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఆనందయ్య మందు తయారీ, పంపిణీ ఆలోచన విరమించుకున్నామని తెలిపారు. కేంద్ర సంస్థ సీసీఆర్ఏఎస్ నివేదికలో ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టమైందన్నారు. ఎవరి నమ్మకాన్ని బట్టి వారు మందు వాడొచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఆనందయ్య మందు వల్ల కరోనా తగ్గుతుందని నిర్థారణ కాలేదని సీసీఆర్ఏస్ చెప్పిందన్నారు. 

మరోవైపు ఆనందయ్య మందు కోసం ఎవరూ కూడా కృష్ణపట్నం రావొద్దని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ఆన్‌లైన్  ధరఖాస్తు చేసుకొన్నవారికి మందును పంపుతామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం నాడు నెల్లూరులో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో ఆనందయ్య సమావేశమయ్యారు. మందు పంపిణీ గురించి చర్చించారు. ఇప్పటికే ఆనందయ్య మందు తయారీకి సంబంధించి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆనందయ్య మందు తయారీ కోసం శాశ్వతంగా వేదికగా తయారు చేస్తున్నారు. ఇవాళ రాత్రికి మందు తయారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే అవసరమైన వనమూలికలు ఇతర పదార్ధాలనే సేకరించారు. 

Also Read:కరోనా థర్డ్ వేవ్ కు నెను రెడీ, రేపటి నుంచే మందు తయారీ: ఆనందయ్య

మరో ఐదు రోజుల్లో మందు పంపిణీ ప్రక్రియను చేపట్టనున్నట్టుగా కలెక్టర్ తెలిపారు. కృష్ణపట్టణం ఎవరూ రావొద్దని కలెక్టర్ కోరారు.మరోవైపు ఓ కాల్ సెంటర్ ను కూడ ఏర్పాటు చేస్తారు. ఈ కాల్ సెంటర్ కు వచ్చే ఆర్డర్ల ద్వారా ఈ మందును పంపిణీ చేయనున్్నట్టుగా కలెక్టర్ చెప్పారు.ఈ మందు ఆర్డర్ చేసేందుకు యాప్ ను తయారు చేస్తామని ఆయన చెప్పారు. వారం రోజులుగా  ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. ఈ మందుతో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రకటించింది. దీంతో ఈ మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

click me!