తిరుమల తిరుపతి దేవస్థానం (tirumala tirupati devasthanam) (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు (vip break darshan) రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది
తిరుమల తిరుపతి దేవస్థానం (tirumala tirupati devasthanam) (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు (vip break darshan) రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుపతి (tirupati) నగరంలో నవంబర్ 14వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ కారణంగా నవంబర్ 12, 13 14వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.
మరోవైపు తిరుమల స్వామివారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ట్, తెలంగాణ రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, సినీ దర్శకుడు గోపీచంద్ దర్శించుకున్నారు. అనంతరం మంత్రి Vemula Prashanth Reddy మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఎన్నికల ఓటమిపై స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు.
undefined
ALso Read:ఈ నెల 14న సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ: ఆరు అంశాలను ప్రస్తావించాలని ఏపీ నిర్ణయం
టీఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలు చూసిందని, చాలా ఎన్నికల్లో విజయం సాధించింది, కొన్నింటిలో అపజయం చూసిందని అన్నారు. నాగార్జున సాగర్, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాలను మేమే గెలుచుకున్నామని గుర్తు చేశారు. రాజకీయాలన్నాక గెలుపోటములు వస్తూ ఉంటాయని, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎన్నికల్లాగే చూస్తుందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దర్శకుడు గోపిచంద్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ఇంటి కులదైవం tirumala స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో హీరో balakrishna తో చిత్రం నిర్మిస్తున్నానని గోపిచంద్ స్పష్టం చేశారు.
ఇకపోతే.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆరు కీలక అంశాలను ప్రస్తావించాలని ఏపీ సీఎం YS Jaganనిర్ణయం తీసుకొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన హామీలతోపాటు అపరిష్కృత అంశాలు, పెండింగ్ బకాయిల గురించి ప్రధానంగా ప్రస్తావించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సదరన్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ అంశాలను అజెండాలో పొందుపరిచినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలు, రెవెన్యూ లోటు, రేషన్ బియ్యంపై హేతుబద్ధతలేని కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లయిస్ బకాయిలు, పోలవరం రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిలపై కూడా ప్రస్తావించనున్నారు.