తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కీలక నిర్ణయం

Published : May 08, 2025, 04:40 AM IST
తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కీలక నిర్ణయం

సారాంశం

తిరుమల పరిసర భూములపై ప్రైవేటీకరణకు ఆంక్షలు, భూముల బదలాయింపు, దర్శన సమయాలపై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు తిరుమల పవిత్రతను కాపాడడానికే  భూముల నిర్వహణలో పారదర్శకతకు దోహదం చేయనున్నాయి. తిరుమల కొండలకు సమీపంగా ఉన్న భూములను ఇకపై ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకూడదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ అంశంపై బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమైంది. చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కొన్ని కీలక భూమి సంబంధిత అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

భూమి రూపంలో ఇవ్వాలని..

తిరుపతి రూరల్ మండలంలో పేరూరు గ్రామంలోని సర్వే నెంబర్ 604లో ఉన్న ఏపీ టూరిజం అథారిటీ (ఏపీటీఏ)కి చెందిన 24.68 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలన్న గత నిర్ణయాన్ని కొనసాగిస్తూ, దానికి ప్రత్యామ్నాయంగా తిరుపతి అర్బన్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 588-ఏలో ఉన్న టీటీడీ భూమిని ఏపీటీఏకి అప్పగించాలని బోర్డు అంగీకరించింది. అంతేగాక, అదే మండలంలోని మరో 10.32 ఎకరాల భూమిని కూడా టీటీడీకి బదలాయించి, దానికి సమాన స్థలాన్ని తిరుపతి అర్బన్‌లోని టీటీడీ భూమి రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థించింది.

ఇదిలా ఉండగా, తిరుమలలో భక్తుల రద్దీ ఈ మధ్య తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. బుధవారం శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు సగటుగా ఆరు గంటల సమయం పట్టింది. మొత్తం 69,214 మంది భక్తులు దర్శించుకోగా, 26,599 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో ఒక్క రోజులోనే రూ. 3.27 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ అధికారికంగా ప్రకటించింది.

తాజాగా వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ పెరుగుతుండటంతో, మే నెల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలపై కొన్ని మార్పులు తీసుకొచ్చినట్టు టీటీడీ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. వీకెండ్‌లలో అధిక సంఖ్యలో భక్తులు చేరడంతో దర్శన సమయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే