
మరో ఏడాదైతే డాక్టర్ కాబోయే యువతి అనుకోని ప్రమాదానికి గురై మృత్యు ఒడికి చేరింది. బయటకు వెళ్లిన ప్రతీ సారి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరిని తోడుగా తీసుకెళ్లే ఆ యువతి.. మొదటిసారి వారెవరూ లేకుండా వెళ్లి దుర్మరణానికి గురైంది. మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న యువతి రైలు ప్రమాదానికి గురై చనిపోయింది. ఈ విషాద ఘటన ఏపీలోని కాకినాడలో చోటు చేసుకుంది.
పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఏపీలోని విజయవాడ మాచవరంలో నివాసం ఉంటున్న ఎస్. శ్రీనివాస్ మోహన్ సిద్ధా స్వస్థలం కాకినాడ. ఆయన వ్యాపారం కోసం విజయవాడలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అమెరికాలో నివసిస్తున్నారు. చిన్న కూతురు 24 ఏళ్ల ఎస్.సత్య తనూష ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నారు.
గుంటూరులోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఓ సదస్సు నిర్వహిస్తున్నారని తెలియడంతో అందులో పాల్గొనాలని ఆమె నిర్ణయింకుంది. దీంతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి గురువారం శేషాద్రి ఎక్స్‌ప్రెస్ లో కాకినాడ కు చేరుకున్నారు. రైలు కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్ లోని ప్లాట్ ఫారమ్ నెంబర్ 2కు చేరుకుంది.
ప్రేమ పెళ్లికి అడ్డువస్తాడని తండ్రి కాళ్లు విరగ్గొట్టించిన కూతురు.. ఏం చేసిందంటే?
ఇంకా రైలు పూర్తిగా ఆగలేదు. నెమ్మదిగా కదులుతోంది. అయితే అదే సమయంలో సత్య తనూష రైలు దిగాలని ప్రయ్నతించింది. కానీ బ్యాలెన్స్ తప్పి పట్టాలపై పడిపోయింది. దీంతో ఆమె వెంట ఉన్న స్నేహితులు అలెర్ట్ అయ్యారు. వెంటనే చైన్ లాగారు. కొన్ని క్షణాల్లో రైలు ఆగిపోయింది. కానీ అప్పటికే ఆమె రైలు పట్టాలు, వీల్స్ కింద నలిగిపోయింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడే చనిపోయింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని ఆమెను బయటకు తీశారు.
సిలికాన్ సిటీలో దారుణం.. మహిళపై ఉబర్ డ్రైవర్ దాడి.. వీడియో వైరల్
కాగా.. ఈ ఘటనపై తండ్రి శ్రీనివాస్ ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. తమ కూతురు బయట ప్రాంతాలకు వెళ్లిన ప్రతీ సారి తానైనా, తమ కుటుంబంలోని సభ్యులెవరైనా ఆమెకు తోడుగా వెళ్తుండేవారిమని గుర్తు చేశారు. కానీ తొలిసారిగా తాము లేకుండా సత్య తనూష వెళ్లి.. ఇంత పెద్ద ప్రమాదానికి గురై చనినపోయిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య కూతురుకు తోడుగా వెళ్తానని అడిగిందని, కానీ తానే వద్దని చెప్పానని ఆయన అన్నారు. కూతురు సొంతంగా ఆమె స్నేహితులతో వెళ్లి, తిరిగి రాగలుగుతుందని ఆమెకు చెప్పానని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.