ట్రూనాట్ టెస్ట్... ఇక గంటలోనే కరోనా ఫలితం: ఏపీ స్టేట్ కొవిడ్ నోడల్ ఆఫీసర్

By Arun Kumar PFirst Published Apr 25, 2021, 9:13 AM IST
Highlights

గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి జగన్ బ్యాక్లాగ్ క్లియర్ అయ్యేవరకు ట్రునాట్, రాపిడ్ టెస్ట్ లు కూడా మొదలు పెట్టవలసిందిగా ఆదేశాలిచ్చారని ఏపీ స్టేట్ కొవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ అర్జా తెలిపారు. 

 అమరావతి: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోకస్ టెస్టింగ్ పైన దృష్టి పెట్టమని ఆదేశాలు ఇచ్చారని ఏపీ స్టేట్ కొవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ అర్జా తెలిపారు. అందులో భాగంగా 104 కాల్ సెంటర్ కు ప్రతి రోజూ పదివేలకు పైగా ఎంక్వైరీ లు వస్తున్నాయని... అందులో ముఖ్యంగా టెస్టింగ్ విషయమై ఎంక్వైరీలు ఉన్నాయన్నారు. రమారమి 70 వేలకు పైగా ప్రైమరీ కాంటాక్ట్స్ కు టెస్ట్ చేయవలసి ఉందని... ప్రతినిత్యం ఫోకస్ టెస్టింగ్ రూపేనా 35 వేల టెస్టులు చేస్తున్నామని అన్నారు. బ్యాక్లాగ్ పెరగటం వలన టెస్ట్ రిపోర్టులు కొద్దిగా ఆలస్యం అవుతున్నాయని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. 

''గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి బ్యాక్లాగ్ క్లియర్ అయ్యేవరకు ట్రునాట్, రాపిడ్ టెస్ట్ లు కూడా మొదలు పెట్టవలసిందిగా ఆదేశాలిచ్చారు. ట్రూనాట్ పరీక్ష ఆర్టీపిసిఆర్ మాదిరిగానే పనిచేస్తుంది కానీ చిన్న కిట్‌తో పనిచేస్తుంది. అలాగే వేగంగా ఫలితాలను ఇస్తుంది'' అని తెలిపారు. 

''కోవిడ్ -19 కోసం స్క్రీనింగ్ మరియు నిర్ధారణ కోస వాడే  ట్రూనాట్ యంత్రం చిప్-ఆధారితంగా పనిచేస్తుంది. ఇది బ్యాటరీలపై నడుస్తుంది. ఇది కూడా నోరు, ముక్కు లోని స్వాబ్ ద్వారా వైరస్ కనుగొనాల్సి ఉంది. వైరస్ డిఎన్ఎలో కనిపించే ఆర్డిఆర్పి ఎంజైమ్‌ను గుర్తించడానికి ఈ యంత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ట్రూనాట్ పరీక్ష 60 నిమిషాల్లో ఫలితాలను అందిస్తుంది'' అని వివరించారు.  

read more  పట్టించుకోని బంధువులు... విజయవాడ జీజీహెచ్‌ మార్చురీలో గుట్టగుట్టలుగా శవాలు

''ఏరియా ఆస్పత్రిలో ఈ పరీక్షలను మొదలు పెట్టినట్లయితే ఫలితాలు త్వరగా రావటమే కాకుండా డిస్ట్రిక్ట్ ఆస్పత్రుల పైన పని భారం అని తగ్గుతుంది, టెస్టులు ప్రజలకు మరింత చేరువులో ఉంటాయి. త్వరితగతిన ఈ మెషిన్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ని అప్డేట్ చేయబోతున్నారు. వచ్చే 48 గంటల్లోపు కిట్స్ కూడా జిల్లాలకు పంపించి ట్రూ నాట్ టెస్ట్ మొదలు పెట్టబోతున్నాం'' అని వెల్లడించారు.

''ట్రూనాట్ టెస్టింగ్ కోసం కావలసిన టెక్నికల్ సిబ్బందిని కూడా రెడీ చేస్తున్నారు. ఇక రాపిడ్ టెస్టులు కూడా వన్ టైం అనుమతి తో బ్యాక్లాగ్ క్లియర్ చేయటానికి వాడబడతాయి. టెస్టుల విషయంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం కు అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది'' అని డాక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు.  
 

click me!