అయేషా మీరా హత్య కేసులో ట్విస్ట్: సిట్ దర్యాప్తునకు బ్రేక్

By Nagaraju TFirst Published Jan 31, 2019, 12:13 PM IST
Highlights

సిట్‌ పునఃదర్యాప్తుకు బ్రేక్‌ పడింది. దీనికి సంబంధించి హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన సీబీఐ  ప్రధాన ఘటనతోపాటు, రికార్డుల ధ్వంసంపై సీబీఐ 2 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. 

విజయవాడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా హత్యకేసులో కేంద్రహోంశాఖ కీలక నిర్ణయం ప్రకటించింది. అయేషా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో సిట్ దర్యాప్తు ఎందుకని ప్రశ్నించింది. విచారణను నిలిపివేయ్యాలంటూ ఆదేశించింది. 

దీంతో సిట్‌ పునఃదర్యాప్తుకు బ్రేక్‌ పడింది. దీనికి సంబంధించి హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన సీబీఐ  ప్రధాన ఘటనతోపాటు, రికార్డుల ధ్వంసంపై సీబీఐ 2 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. 

తాజాగా ఈ కేసును దర్యాప్తు విషయంలో కీలక నిర్ణయం ప్రకటించింది సీబీఐ. అయేషా కేసు విచారించిన పోలీసులను విచారించాలని నిర్ణయం తీసుకుంది. దర్యాప్తులో పాల్గొన్న 15 మంది అధికారులతో జాబితాను సైతం సిద్ధం చేసింది. 

సీబీఐ రంగంలోకి దిగడంతో రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్ సైతం దర్యాప్తులో వేగాన్ని తగ్గించింది. అయితే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సిట్ కూడా రద్దు అయినట్లేనని తెలుస్తోంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

రాత్రి పూట వచ్చి తలుపులు కొడుతున్నారు: సత్యంబాబు

click me!