పోలవరం నిర్మాణంలో జగన్ సర్కార్ ముందడుగు.. కీలక అంకం పూర్తి

By Siva KodatiFirst Published Mar 26, 2021, 8:19 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కీలక అంకం పూర్తయ్యింది. గేట్ల ట్రయల్ రన్‌ విజయవంతమైంది. మొత్తం 48 గేట్లకు గానూ 34 గేట్ల అమరిక పనులు, మొత్తం 96 సిలిండర్లకు గానూ 56 సిలిండర్ల బిగింపు పనులు పూర్తయ్యాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కీలక అంకం పూర్తయ్యింది. గేట్ల ట్రయల్ రన్‌ విజయవంతమైంది. మొత్తం 48 గేట్లకు గానూ 34 గేట్ల అమరిక పనులు, మొత్తం 96 సిలిండర్లకు గానూ 56 సిలిండర్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. 24 పవర్ ప్యాక్‌లకు గానూ 5 పవర్ ప్యాక్‌లు బిగింపు పూర్తయ్యింది. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను ఎత్తవచ్చు.

10 రివర్ స్లూయిజ్ గేట్లకు గానూ 10 గేట్ల అమరిక, 3 రివర్ స్లూయిజ్ గేట్లకు సిలిండర్ల అమర్చడం పూర్తయ్యింది. ఇప్పటికే 44, 43వ గేట్లకు కిందకి పైకి ఎత్తడంతో ట్రయల్ రన్ విజయవంతమైంది.

తొలుత 44వ గేటును 6 మీటర్లు పైకి ఎత్తి మరలా 3 మీటర్లు కిందకి దించారు. హైడ్రాలిక్ సిలిండర్ సాయంతో గేటును నిమిషానికి 1.5 మీటర్లు ఎత్తే విధంగా డిజైన్ చేశారు.

2,400 టన్నుల ఒత్తిడిని సైతం తట్టుకునేలా ఈ గేట్లను రూపొందించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మిగతా గేట్లను ఎత్తేందుకు చురుకుగా పనులు జరుగుతున్నాయి. 

click me!