నిడదవోలు జంక్షన్‌లో తెగిన 11 కేవీ విద్యుత్ లైన్: నిలిచిన రైళ్ల రాకపోకలు

Published : Apr 18, 2023, 03:11 PM ISTUpdated : Apr 18, 2023, 03:28 PM IST
 నిడదవోలు జంక్షన్‌లో తెగిన  11 కేవీ  విద్యుత్  లైన్:  నిలిచిన రైళ్ల రాకపోకలు

సారాంశం

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు లో  11 కేవీ విద్యుత్  లైన్  తెగింది.  దంతో రైళ్లు ఎక్కడికక్కడే  నిలిచిపోయాయి.  ఈ విషయమై  అధికారులు  విద్యుత్  లైన్  పునరుద్దరణ  పనులు  చేపట్టారు. 

ఏలూరు:తూర్పుగోదావరి  జిల్లా నిడదవోలులో 11 కేవీ విద్యుత్  లైన్  మంగళవారం నాడు తెగింది. దీంతో  విజయవాడ-విశాఖపట్టణం  మార్గంలో   రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.  తెగిపోయిన  1 కేవీ విద్యుత్ లైన్  పనులకు  అధికారులు  మరమ్మత్తులు  చేస్తున్నారు. విద్యుత్  సరఫరా పునరుద్దరిస్తే  ఈ మార్గంలో  రైళ్ల రాకపోకలు  తిరిగి  ప్రారంభం కానున్నాయి. విద్యుత్  సరఫరా నిలిచిపోవడంతో  రైళ్లు ఎక్కడికక్కడే  నిలిచిపోయాయి.  విద్యుత్    సరఫరాను పునరుద్దరించి  రైళ్ల రాకపోకలను  పున ప్రారంభించేందుకు  రైల్వే శాఖాధికారులు  చర్యలు చేపట్టారు. 11కేవీ విద్యుత్ లైన్  ఎలా తెగిపోయిందనే  విషయమై  అధికారులు దర్యాప్తు  చేస్తున్నారు.  మరో వైపు విద్యుత్  ను పునరుద్దరించే  పనులపై  రైల్వే శాఖ కేంద్రీకరించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం