
బీజేపీ సీనియర్ నేత సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై సునీల్ ధియోధర్ స్పందించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో బీజేపీకి, వైసీపీకి మధ్య ఏం లేదని స్పష్టమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ రౌడీ రాజ్యం నడుపుతున్నారని విమర్శించారు. జగన్ అవినీతి పాలనపై బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.