Chopper Crash in Nalgonda: ట్రైనీ పైలట్ మహిమ మృతదేహం కుటుంబానికి అప్పగింత.. ‘ఆమెకు 6 నెలల ట్రైనింగ్’

Published : Feb 26, 2022, 05:44 PM ISTUpdated : Feb 26, 2022, 05:45 PM IST
Chopper Crash in Nalgonda: ట్రైనీ పైలట్ మహిమ మృతదేహం కుటుంబానికి అప్పగింత.. ‘ఆమెకు 6 నెలల ట్రైనింగ్’

సారాంశం

నల్లగొండ జిల్లా తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం ఓ ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలట్ మహిమ దుర్మరణం చెందారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ మృతదేహాన్ని చెన్నైకి తరలించారు.  

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్టు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. మృతి చెందినవారు ట్రైనీ పైలట్(Trainee Pilot) మహిమ(Mahima)గా అధికారులు గుర్తించారు. ట్రైనీ పైలట్ మహిమ హెలికాప్టర్‌ను టేకాఫ్ చేసిన కొద్దిసేపటి ఆ చాపర్‌కు సంబంధాలు తెగిపోయాయని వివరించారు. కాగా, మహిమ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మృతదేహాన్ని చెన్నైకి తరలించారు. 

ట్రైనీ పైలట్ మహిమ ఆరు నెలలుగా శిక్షణ పొందుతున్నట్టు తెలిసింది. ఆమెకు 85 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నదని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదవశాత్తు ఆమె ట్రైనీ హెలికాప్టర్‌ను గాల్లోకి ఎగిరించిన కొద్ది సేపటికి దానికి గ్రౌండ్‌ అధికారులతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో హెలికాప్టర్‌పై ఆమెకు నియంత్రణ కోల్పోయి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.

న‌ల్ల‌గొండ జిల్లా పెదవూర మండలంలోని (Pedavura mandal) తుంగతుర్తి గ్రామ (Tungaturthy village) సమీపంలో శనివారం ఓ ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ మహిళా ట్రైనీ పైలట్ మృతిచెందారు. ఆమెను తమిళనాడుకు చెందిన మహిమగా గుర్తించారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వ‌రి కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ..  సింగిల్ సీటర్ చాపర్ ప్రమాదానికి గురైందన్నారు. ఈ చాపర్ నాగార్జున సాగర్‌లోని విజయపురి సౌత్‌లో ఉన్న ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందినదని తెలిపారు. 

శిక్ష‌ణ‌లో భాగంగా త‌మిళ‌నాడుకు చెందిన ట్రైనీ పైల‌ట్ మ‌హిమ‌.. ఏవియేష‌న్ అకాడ‌మీ నుంచి శనివారం ఉద‌యం 10:30 గంటలకు చాపర్‌లో టేకాఫ్ అయింది. ఉద‌యం 10:50 గంట‌ల‌కు చాప‌ర్ కుప్ప‌కూలిపోయిందని తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. అయితే ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉందన్నారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌నే అంశంపై డీజీసీఏ, పోలీసుల‌ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని ఎస్పీ రెమా రాజేశ్వ‌రి పేర్కొన్నారు.

చాప‌ర్ కూలిన స‌మ‌యంలో భారీ శ‌బ్దం వినిపించింద‌ని ఘటన స్థలానికి సమీపంలో పనిచేస్తున్న రైతులు, కూలీలు చెప్పారు. భారీ శబ్దంతో పాటుగా ద‌ట్ట‌మైన మంట‌లు, పొగ‌లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. హెలికాప్ట‌ర్ కూలిన వెంట‌నే అక్క‌డికి చేరుకుని పోలీసుల‌కు స‌మాచారం అందించామ‌ని తెలిపారు. నాగార్జున సాగ‌ర్ వైపు నుంచి హెలికాప్ట‌ర్ వ‌చ్చిన‌ట్లు స్థానికులు పేర్కొన్నారు. వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu