భార్యపై కత్తితో దాడి చేసి, హత్య చేసిన భర్త.. అనుమానంతో దారుణం..

By SumaBala BukkaFirst Published Feb 26, 2022, 2:10 PM IST
Highlights

అనుమానంతో ఓ భర్త విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. వంట చేస్తున్న భార్య మీద దారుణంగా దాడికి తెగబడ్డాడు. కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది.

నెల్లూరు : కడదాకా తోడుండాల్సిన కట్టుకున్న భర్తే.. ఆమె పాలిట యముడయ్యాడు. భార్యపై Suspicion పెంచుకున్న భర్త విచక్షణ కోల్పోయాడు. తరచూ ఆమెతో గొడవ పడేవాడు. అతని వేధింపులు తాళలేక భార్య వేరుగా ఉంటుంది. దీంతో మరింత అనుమానం పెంచుకున్న husband ..భార్య పై knifeతో దాడి చేసి పరారయ్యాడు. రక్తపుమడుగులో పడివున్న బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. 

nellore జిల్లా వెంకటాచలం మండలంలోని చవటదళితవాడకు చెందిన బాల పెంచలయ్య, సీతమ్మ దంపతులు. అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో అనుమానం చిచ్చు రేపింది. దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. అనుమానంతో సుజాతను Bala Penchalaya తరచూ వేధిస్తూండేవాడు. వివాదాలు మరీ ఎక్కువ కావడంతో రెండేళ్లుగా ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు.

దీంతో భార్యపై మరింత అనుమానం పెంచుకున్న బాల పెంచలయ్య..  గురువారం రాత్రి ఆమె వంట చేస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. సుజాత గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు హత్యకు పాల్పడిన బాల పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు 

ఇదిలా ఉండగా, పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి చీర కొనుక్కుందని ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువతిని కర్కశంగా హతమార్చాడు. చీర కొనుక్కుందన్న కోపంతో ఇటుక రాయితో తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. ఈ ఘటన  west godavari districtలో జరిగింది.నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలేనికి చెందిన కళ్యాణం దుర్గా ప్రసాద్, పెంటపాడు మండలం రామచంద్రాపురానికి చెందిన దానమ్మ పెద్దలను ఎదిరించి love marriage చేసుకున్నారు. దానమ్మ తల్లిదండ్రులు బూరలు, రబ్బర్ బ్యాండ్లు, చెంపపిన్నులు.. వంటి సామగ్రి విక్రయిస్తూ జీవనం సాగించేవారు. దుర్గాప్రసాద్ కూడా అదే వృత్తి చేసేవాడు. 

తాగుడు, జూదానికి బానిసైన అతను ఇంటి బాధ్యత వదిలేశాడు. వీరికి ఒక కుమార్తె పుట్టింది. ఇల్లు కూడా గడవని పరిస్థితి ఏర్పడటంతో దానమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో Begging చేసి భర్త, అత్త మామలను పోషించేది. alcoholకి బానిసైన దుర్గాప్రసాద్ ఆమె భిక్షాటన చేసి తీసుకొచ్చిన సొమ్ము కూడా లాక్కునేవాడు. దానమ్మ గర్భిణి అని చూడకుండా తీవ్రంగా కొట్టడంతో 20 రోజుల క్రితం ఆమెకు abortion అయ్యింది. 

ఇటీవల భర్తకు తెలియకుండా రూ.200తో చీర కొనుక్కుందని తెలిసి ఆమెతో బుధవారం రాత్రి తొమ్మిది నుంచి పదిగంటల మధ్య గొడవ జరిగింది. అత్త మరిడమ్మ కూడా అతనికి తోడైంది. ఈ గొడ పెరిగి పక్కనే ఉన్న Brickతో దానమ్మను తీవ్రంగా కొట్టాడు. బాధ తట్టుకోలేక ఆమె అరిచిన అరుపులకు రాత్రి పదిగంటల సమయంలో చుట్టుపక్కలవారు పోగయ్యారు. 

దెబ్బలకు దానమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. దానమ్మ భర్త, అత్త కొట్టి చంపారని మృతురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి గూడెం రూరల్ సీఐ రవికుమార్, నల్లజర్ల ఎస్ ఐ అవినాష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

గృహహింసకు పాల్పడినందుకు, అబార్షన్ కు కారణమైనందుకు భర్త, అత్త మీద కేసు నమోదు చేశారు. తల్లిని కోల్పోయిన ఏడాది వయసున్న చిన్నారి ఏం జరిగిందో తెలియక బిత్తర చూపులు చూస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. 

click me!