
విజయవాడ: జనసేనతో తమ పార్టీకి మధ్య ఎలాంటి విబేధాలు లేవని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.జనసేన, బీజేపీ నేతలు బుధవారం నాడు విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత వీరిద్దరూ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
also read:ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: సోము వీర్రాజు, నాదెండ్ల మనోహార్ భేటీ
రెండు పార్టీల మధ్య స్నేహపూరిత వాతావరణమే కొనసాగుతోందన్నారు. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన చెప్పారు. ఈ నెల 29వ తేదీ లోపుగానే నామినేషన్ల ప్రక్రియను ఆన్ లైన్ లో చేపట్టాలని ఆయన కోరారు. ఏకగ్రీవాల కోసం వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
ఏకగ్రీవాల విషయంలో మంత్రులు, వైసీపీ నేతల ప్రకటనలు అనేక అనుమానాలను రేకేత్తిస్తున్నాయని జనసేన నే నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.ఈ ప్రకటనల వెనుక ఉద్దేశ్యాలు ఏమున్నాయనే విషయనాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.